Chhaava Movie: చావాకు రెండు ప్రభుత్వాల బంపర్ ఆఫర్.. అది భయ్యా.. సింహం పిల్ల రేంజ్ అంటున్న నెటిజన్లు..

Chhaava movie records: మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఎక్కడ చూడా చావా సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

1 /6

చావా సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో సెన్సెషన్ గా మారింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దీన్ని లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా  మరాఠా నవల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు.

2 /6

శంభాజీ పాత్రంలో విక్కికౌశాల్, శంభాజీ సతీమణి యేసుబాయ్ పాత్రంలో రష్మిక మందన్న నటించారు. మొత్తంగా విక్కి కౌశాల్ నటనకు అందరు ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో ప్రతి ఒక్కసీన్ కూడా.. కూడా అభిమానుల్ని ఎమోషన్ కు గురిచేస్తుంది. అంతే కాకుండా.. స్వరాజ్యం కోసం శంభాజీ మహారాజ్ ఎంతటి త్యాగాలు చేశాడు.. ఆయన్ను ఔరంగా జేబ్ ఎలాంటి చిత్ర హింసలు పెట్టాడో చూపించారు.

3 /6

ఈ సినిమాను చూసేందుకు వచ్చిన వాళ్లు చాలా మంది మూవీ చూస్తున్న ఎమోషన్ కు గురౌతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు చావా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రస్తుతం 300 కోట్ల దిశగా దూసుకునిపోతుంది. అయితే.. ఈ మూవీని కేవలం హిందీలోనే చిత్ర యూనిట్ విడుదల చేశారు.

4 /6

అయితే.. ఈ మూవీకి తాజాగా.. మధ్య ప్రదేశ్ మోహన్ యాదవ్ ప్రభుత్వం టాక్స్ ఫ్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా దేశం కోసం మరాఠా యోధుడు చేసిన త్యాగాలు చూపించి.. ప్రజల్ని ఎమోషన్ చేసేలా ఉందని.. దేశ భక్తిని రగిలించేలా ఉందని గోవాప్రమోద్ సావంత్   సర్కారు సైతం.. ఈ మూవీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.   

5 /6

ప్రస్తుతం చావా మూవీ చూసి అనేక  మంది అభిమానులు చాలా ఎమోషన్ అవుతున్నారు. మొత్తంగా చావాను తెలుగులో తీస్తే.. ఇంకా అనేక రికార్డును చావా సొంతం చేసుకునేదని కూడా ట్రెడ్ పండితులు భావిస్తున్నారు.  

6 /6

చావా సినిమాతో విక్కి కౌశాల్, రష్మిక మందన్న లు  ఒక రేంజ్ లో బాలీవుడ్ లో వెలిగిపోతున్నారని.. ముఖ్యంగా రష్మిక మందన్నను గోల్డెన్ లెగ్ అంటూ ఆమెను సోషల్ మీడియాలో పొగడ్తత వర్షం కురిపిస్తున్నారు.