Kisan Vikas Patra Scheme Interest Rate: పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల్లో భాగంగా కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకంలో పెట్టుబడి పెట్టేవారికి భారీ మొత్తంలో వడ్డీ లభిస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Kisan Vikas Patra Scheme Interest Rate: భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి పోస్ట్ ఆఫీస్ ప్రత్యేకమై పొదుపు ఖాతాలను అందిస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ పొదుపు ఖాతాలు వరం కంటే ఎక్కువగా చెప్పుకోవచ్చు. అతి తక్కువ పెట్టుబడితోనే అధిక వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నో రకాల పొదుపు పథకాలను కూడా అందిస్తోంది. వీటిల్లో పెట్టుబడి పెట్టే వారికి ప్రత్యేకమైన భీమాతో పాటు అధిక వడ్డీ కూడా లభిస్తోంది. అయితే ఇటీవలే అధిక వడ్డీ చెల్లించే ఓ పథకం విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యంత ప్రజాదరణ పొందిన పోస్ట్ ఆఫీస్ పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర (KVP) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారికి భారీ మొత్తంలో బడ్డీ లభించడమే కాకుండా ప్రత్యేకమైన కొన్ని బెనిఫిట్స్‌ను కూడా అందిస్తోంది. ఈ పథకంలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టి భారీగా డబ్బు పొందవచ్చు.
ఈ కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకంలో పెట్టుబడి పెట్టేవారికి దాదాపు 7.5 శాతం వడ్డీ లభిస్తోందని కేంద్ర తెలిపింది. ఇందులోను తక్కువల తక్కువక రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చని పేర్కొంది. అంతేకాకుండా ఇందులో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.
అలాగే ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేమైన విషయం ఏంటటే.. ఇందులో పెట్టుబడి పెట్టిన ఏకకాలంలో డబ్బులకు వడ్డీ లభిస్తుందని కిసాన్ వికాస్ పత్ర పథకం వివరాల్లో పేర్కొన్నారు. అలాగే ఇందులోని భారీగా వడ్డీ లభించడం వల్ల భారీ మొత్తంలో డబ్బు పొందవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర పథకంలో భాగంగా డబ్బు పెట్టుబడి పెట్టేవారికి 115 నెలల్లో వడ్డీతో పాటు రెట్టింపు ఆదాయం లభిస్తుంది. ఉదాహారణకు ఈ పథకంలో భాగంగా ఎవరైనా 5 లక్షలు పెట్టుడి పెడితే 9 సంవత్సరాల్లో దాదాపు రూ.5 లక్షల వడ్డీ లభిస్తుంది. దీంతో మొత్తం మీరు రూ. 10 లక్షల కంటే ఎక్కువగానే డబ్బులు తిరిగి పొందవచ్చు.
మళ్లీ తొమ్మది సంవత్సరాల తర్వాత ఇదే రూ.10 లక్షలను మరో 9 సంవత్సరాలు అలాగే ఉంచితే.. దాదాపు రూ.20 లక్షల కంటే ఎక్కువగా డబ్బులు తిరిగి పొందవచ్చు. అంటే దాదాపు 9 ఏళ్ల తర్వాత 10 లక్షలకు పైగా వడ్డీ లభిస్తుంది.