Pawan Kalyan Holy Dip In Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళాలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబంతో పుణ్య స్నానం ఆచరించారు. భార్య, కుమారుడు, స్నేహితుడితో కలిసి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
దశాబ్దం తర్వాత జరిగే అతిపెద్ద హిందూవుల ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభా మేళ కోలాహలంగా.. భక్తిపూర్వకంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో మహాకుంభమేళ ముగుస్తుండడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
సనాతనం ధర్మం పేరిట ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాకుంభమేళలో పాల్గొన్నారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించారు.
త్రివేణి సంగమంలో తన సతీమణి అనాలెజ్నోవా కొణిదెల, తనయుడు అకీరా నందన్, అతడి స్నేహితుడు, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పవన్ కల్యాణ్ మహాకుంభమేళలో పుణ్యస్నానాలు చేశారు.
పుణ్య స్నానం ఆచరించిన అనంతరం పవన్ కల్యాణ్ తన కుటుంబంతో కలిసి గంగా హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.
కుంభమేళాలో పవన్ కల్యాణ్ కుటుంబం పుణ్యస్నానాలకు అక్కడి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కల్యాణ్ అక్కడి అధికారులు విశేష గౌరవం అందించారు.
పుణ్యస్నానం అనంతరం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహా కుంభమేళకు యోగి ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక యాత్ర, రాజకీయ అడుగులు, సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ స్పందించారు.