New India Co-op Bank: కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బిఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు బ్యాంకు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకు దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి.
New India Co-op Bank: ముంబై కేంద్రంగా పనిచేస్తున్న న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ పై ఆర్‌బిఐ అనేక ఆంక్షలు విధించింది. అలాగే, ఆర్‌బిఐ బ్యాంకు డైరెక్టర్ల బోర్డును 12 నెలల పాటు రద్దు చేసింది.ది న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ కాలంలో ఆర్‌బిఐ మాజీ ఎస్‌బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్‌ను బ్యాంకు నిర్వాహకుడిగా నియమించింది.
నిర్వాహకుడికి సహాయం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సలహాదారుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సలహాదారుల కమిటీ సభ్యులలో మాజీ SBI జనరల్ మేనేజర్ రవీంద్ర సప్రా, అభిజీత్ దేశ్‌ముఖ్ (CA) ఉన్నారు. బ్యాంకుపై ఆర్బీఐ విధించడంతో ఆందోళన చెందిన ఖాతాదారులు బ్యాంకు ముందు బారులు తీరారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ పై గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ఆంక్షలు విధించింది. ఈ పరిమితుల ప్రకారం, బ్యాంకు కస్టమర్లు తమ ఖాతాల నుండి డబ్బును ఉపసంహరించుకోలేరు.
బ్యాంకు ప్రస్తుత ద్రవ్యత స్థితిని దృష్టిలో ఉంచుకుని, ఖాతా రకంతో సంబంధం లేకుండా, న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు ఎంత మొత్తాన్నైనా ఉపసంహరించుకోవడాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిమితం చేసింది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఆర్‌బిఐ ఆ బ్యాంకును రాబోయే 6 నెలల పాటు నిషేధించింది. ప్రస్తుతం అది సమీక్షించబడుతోంది.
కాగా ఆ బ్యాంక్ ప్రస్తుత ద్రవ్యత స్థితి ద్రుష్ట్యా పొదుపు లేదా కరెంట్ ఖాతాల నుంచి విత్ డ్రాలు నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట షరతుల ప్రకారం డిపాజిట్లపై రుణాలను ఆఫ్ సెట్ చేయడానికి అనుమతి ఇచ్చింది.
ఉద్యోగుల జీతాలు, అద్దె విద్యుత్ బిల్లులు వంటి ముఖ్యమైన ఖర్చులకు నిధులను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఆరు నెలల వరకు ఆ ఆంక్షలు అమల్లో ఉంటాయని..ఆ తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు ఆర్బిఐ ఆంక్షల విషయాన్ని కస్టమర్లకు ఆ బ్యాంకు తెలిపింది. దీంతో బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఖాతాదారులు అక్కడికి చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్రుద్ధులు, మహిళలు తమ డిపాజిట్ పత్రాలు వెంటతెచ్చారు. నగదు విత్ డ్రా కోసం క్యూ కట్టారు. అయితే బ్యాంకు సిబ్బంది అనుమతించకపోవడంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. దీంతో ఆ బ్యాంకు దగ్గర గందరగోళ పరిస్థితి నెలకొంది.