TGSRTC: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొట్ట మొదటి పథకం మహిళలకు ఫ్రీ బస్సు. ఈ పథకం ఇపుడు తెలంగాణలో వికటించిందనే చెప్పాలి. మహిళలకు ఫ్రీ అని చెప్పిన ప్రభుత్వం పురుషుల నుంచి పండగల పేరిట నిలువు దోపిడీకి తెర లేపింది.
TGSRTC: మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రభుత్వానికి ఎసరు తెచ్చేలా ఉంది. ఉచిత బస్సు అంటూ ఉన్న బస్సులను తగ్గించడంతో పాటు..కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించడం మూలానా మహిళలకు లేని పోని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఓ వైసు కుటుంబంలో మహిళలకు ఫ్రీ బస్సు అంటూనే పురుషులపై అదనపు భారం వేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉచిత బస్సు కారణంగా పురుషులకు బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. అటు కండక్టర్లు.. డ్రైవర్లు.. ఉచితం అనగానే.. మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే దసరా, బతుకమ్మ పండగల పేరిట అధిక ఛార్జీలు వసూల్లు చేస్తోన్న తెలంగాణ ఆర్టీసీ.. తాజాగా దీపావళి పండగ పేరుతో ప్రయాణీకుల నడ్డి విరుస్తోంది.
ప్రత్యేక బస్సుల పేరుతో తెలంగాణ ఆర్టీసీ దోపిడీకి పాల్పడుతోంది. దీపావళి పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి నేటికి అమలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ లోని జేబిఎస్ కు 330 రుపాయలు టికెట్ కాగా దీపావళి పండుగ పేరుతో ప్రయాణికుల నుంచి 470 వసూలు చేస్తున్నారు.
ఇదేమిటని ప్రశ్నిస్తే మాకు వచ్చిన ఆదేశాల మేరకే వసూలు చేస్తున్నామని కండక్టర్లు చెబుతున్నారు. అయితే రద్దీకి తగట్టుగా బస్సులు లేవని ప్రయాణీకులు వాపోతున్నారు. దీంతో ఎక్కువ చార్జీలు పెట్టి నిలుచును ప్రయాణించాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు ఆర్టీసీ తీరుపై మండిపడటమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారు.