Telugu Hero Divorce : ఈమధ్య ఎంతో మంది సెలబ్రిటీలు..పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే విరాకులు తీసుకుంటున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అలా అని మూడుముళ్లతో బంధం మొదలుపెట్టి.. ఎంతో కాలం కలిసి ఉన్న సెలబ్రిటీలు కూడా లేకపోలేదు.. ఈ క్రమంలో ఒక స్టార్ హీరో కి సంబంధించిన వార్త మాత్రం పెద్ద వైరల్ అవుతుంది..
ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా, టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
‘ఒక వి చిత్రం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, ‘వైశాలి’ సినిమాతో మరింత క్రేజ్‌ను సంపాదించారు. విలన్‌గా, హీరోగా వరుస సినిమాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్న ఆది..‘సరైనోడు’ చిత్రంలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.
2022లో హీరోయిన్ నిక్కీ గల్రానీని ప్రేమించి వివాహం చేసుకున్న ఆది, వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఆయన విడాకుల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరి పెళ్లయి మూడు సంవత్సరాలు గడిచినా, ఇంకా పిల్లలు లేని కారణంగా ఈ ఊహాగానాలు మరింత బలంగా వినిపించాలి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన ఆది, ‘‘ఇలాంటి వార్తలను నేను గమనించాను. మొదట షాక్ అయినా, తర్వాత పట్టించుకోవడం మానేశాను. వారి ఊహలను బట్టి వార్తలు రాసేస్తున్నాడు. కానీ నిజమైన పరిస్థితిని తెలుసుకోకపోవడం బాధాకరం. నేను నిక్కీతో చాలా సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆది పినిశెట్టి ‘శబ్దం’ సినిమాలో నటిస్తున్నారు. అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఫిబ్రవరి 28న విడుదలకు సిద్ధమవుతోంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ఆది సిద్ధమయ్యారు.