Telangana RTC Ticket Charges Hike: తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు అమాంతం పెంచేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ టోల్ చార్జీలను పెంచినసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ టోల్ చార్జీలను ఆకస్మికంగా పెంచేసింది.
టోల్ ప్లాజా ఎలా ఉన్న మార్గాల ప్రయాణించే ఆర్టీసీ బస్సులో రూ. 3 చొప్పున చార్జీలు పెరిగాయి. ఈనేపథ్యంలో ఈ టోల్ అదనపు చార్జీలను ప్రభుత్వం సామాన్యులపై మోపింది. పెంచిన రూ. 3 సామాన్యుల టికెట్ ధరల్లో మార్పులు చేసింది.
దీంతో టోల్ ద్వారా వెళుతున్న ఆర్టీసీ బస్సుల్లో టికెట్ చార్జీలు పెరిగాయి. అంటే ఇప్పటికే ఉన్న ఆ ధరలు మూడు రూపాయలు చొప్పున పెరిగాయి. ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 10 చార్జీలు వసూలు చేస్తే ఇప్పుడు రూ. 13 కి చేరింది.
సూపర్ లగ్జరీ రూ. 13 నుంచి 16కు చేరగా హైబ్రిడ్ స్లీపర్ రూ. 15 నుంచి 18కి, ఏసీ స్లీపర్ 20 నుంచి 23 కు వజ్రా బస్సుల్లో రూ.13 నుంచి రూ.16 కు అదనపు టోల్ ఛార్టీ ధరలు పెరిగాయి.
ఆర్టీసీ బస్సు ద్వారా నిత్యం 30 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తారు సిటీలో 12 లక్షల ప్రయాణాలు చేయగా పల్లెల్లో పన్నెండు లక్షల మంది బస్ జర్నీ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో టోల్ గుండా వెళ్తున్న వారిపై అదనపు భారం పడనుంది.
ఈ సందర్భంగా బస్సు టీం మిషన్లలో కూడా ఆయా మార్పులు చేశాయి. దీంతో చార్జీలు పెంపకం పై ఎటువంటి సమాచారం లేకపోవడంతో సామాన్యులకు షాక్ గురవుతున్నారు. అంతేకాదు ఇలా చెప్ప పెట్టకుండా చార్జీలు పెంచడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )