School Holidays: విద్యార్థులకు మళ్లీ గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో 26, 27 వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు..!

School Holidays Two days: విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్‌. ఫిబ్రవరి 14వ తేదీ 'షబ్‌ ఏ బరాత్‌' సందర్భంగా కొన్ని మైనారిటీ స్కూళ్లకు సెలవు వచ్చింది. దీంతోపాటు ఈనెల 26, 27 రెండు రోజులు వరుసగా సెలవులు రాబోతున్నాయి. ఎందుకో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

సాధారణంగా ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా సెలవు ఉంటుంది. ఆరోజు శైవాలయాల్లో శివారాధన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతోపాటు మరుసటి రోజు 27వ తేదీ కూడా సెలవు రానుంది. దీంతో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవు రానుంది. దీంతో విద్యార్థులకు మరోసారి ఎగిరిగంతేసే వార్త ఇది.  

2 /5

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి ఎన్నికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు రానుంది. దీంతోపాటు గుంటూరు, కృష్ణ జిల్లాల్లో కూడా సెలవు రానుంది.  

3 /5

అదేవిధంగా మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంగనర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఫిబ్రవరి 27వ తేదీ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ సీట్‌, గ్రాడ్యూయేట్‌ ఎన్నికల నేపథయంలో ఈ సెలవు రానుంది.  

4 /5

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నామినేషన్‌ స్వీకరణ మొదలైంది. 10 వ తేదీ వరకు జరుగుతుంది. 13వ తేదీ వరకు నామినేషన్‌ వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి మరుసటి రోజు 27వ తేదీ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.  ఈ నేపథ్యంలో వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.  

5 /5

తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్‌లో 2 గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ జిల్లాల్లోని టీచర్లు ఓటు వేయనున్న నేపథ్యంలో ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు రానుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.