Arrest Warrant To Actor Sonusood: నటుడు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అతడిని కోర్టు ముందు ప్రవేశ పెట్టాలని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ విచారణను తదుపరి ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నటుడు సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అడ్వకేట్ కేసులో సాక్షిగా సోనూసూద్‌ను పేర్కొన్నారు. అయితే, విచారణకు సోనూసూద్ రాకుండా ఉన్నారు.
రూ.10 లక్షల మోసం జరిగిందని రాజేష్ ఖన్నా ఓ వ్యక్తిపై కోర్టులో కేసు పెట్టారు. రిజికా కాయిన్ పేరుతో మోసం చేశాడని దీనికి సాక్షిగా నటుడు సోనూసూద్ పేరును చేర్చారు. విచారణకు కోర్టు పిలవగా సదరు నటుడు హాజరు కాలేదు.
పలుమార్లు సమన్లు పంపించినా స్పందన లేకపోవడంతో లుథియానా కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక ఈ కేసు విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగుతోపాటు ఇతర భాషల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సోనూసూద్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కరోనా సమయంలో మరింత మంది ఫ్యాన్స్‌ను తన ఖాతాల్లో వేసుకున్నాడు. బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు.
తెలుగులో సూపర్, అరుంధతి సినిమాల్లో ఆకట్టుకున్నారు. ఇక హిందీలో ఫతేహ్ సినిమాకు డైరెక్షన్ కూడా చేశారు. ఈ సినిమా మంచి పేరును సంపాదించింది. ఇందులో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ నటించారు.