Mokshagna: మోక్షజ్ఞ సరసన స్టార్ కిడ్.. తెరపై రచ్చరంబోలే..!

Mokshagna Debut: నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకవైపు హీరోగా మరొకవైపు రాజకీయ నాయకుడిగా ఇంకొక వైపు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. నటనలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన మాస్ హీరోగా సెటిలైపోయారని చెప్పవచ్చు. 
 

1 /5

ఇటీవల బోయపాటి దర్శకత్వంలో మూడు సినిమాలతో వరుసగా విజయాలు సాధించి, హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. ఇప్పుడు అఖండ - 2 కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మరొకవైపు బాబీ డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.   

2 /5

సెప్టెంబర్ ఆరవ తేదీన మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా చాలా గ్రాండ్ గా ప్రకటించారు.  హనుమాన్ సినిమాతో..పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

3 /5

దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందులో భాగంగానే హీరోయిన్ గా.. ఎవరు రాబోతున్నారు అంటూ కొంతమంది పేర్లు వినిపించగా.. ఫైనల్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కూతురిని.. ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

4 /5

కేజీఎఫ్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సొంతం చేసుకున్న రవీనా టాండన్, అనిల్ తడాని కూతురు రాషా తడాని హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం . ఇటీవలే ఈమె లుక్ టెస్ట్ చేయగా ఆమె సక్సెస్ఫుల్ అయినట్టు తెలుస్తోంది.  

5 /5

ఇదిలా ఉండగా భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య డిసెంబర్ రెండవ తేదీన చాలా గ్రాండ్ గా లాంచ్  కానున్నట్లు సమాచారం. సోషియా ఫాంటసీ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కామియో రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. బాలకృష్ణ తన కొడుకు సినిమా కోసం అన్ని దగ్గరుండి.. చూసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరోయిన్ కూతుర్ని రంగంలోకి దింపడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.