Sourav Ganguly Controversies: టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన అద్భుతమైన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించిన దాదా.. కెరీర్లో కొన్ని వివాదాల్లోనూ వార్తల్లో నిలిచాడు. గంగూలీ కెరీర్లో చోటు చేసుకున్న వివాదాలు ఇవే..
గంగూలీ.. ఈ పేరు చెబితేనే టీమిండియా క్రికెట్లరకు ధైర్యం గుర్తువస్తుంది. ఈ దిగ్గజ ప్లేయర్ దేనికి బెదరడు. వివాదాలను అస్సలు పట్టించుకోడు. ఓ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వాను టాస్ కోసం ఎలా వెయిట్ చేయించిన కథ క్రికెట్ అభిమానులకు తెలిసిందే. ఆసీస్ మానసికస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు గంగూలీ ఉద్దేశపూర్వకంగా అలా చేశాడని వా ఇప్పటికీ భావిస్తున్నాడు.
సౌరవ్ గంగూలీ, షేన్ వార్న్ ఐపీఎల్లో ఒక క్యాచ్ విషయంలో గొడవ పడ్డారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న వార్న్‌కు కోపం తెప్పించగా.. థర్డ్ అంపైర్ క్యాచ్‌ను మళ్లీ చెక్ చేయాలని గంగూలీ కోరాడు. దీంతో వార్నర్-గంగూలీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు, సహచరులు వచ్చి విడిపించారు.
నాట్‌వెస్ట్ ట్రోఫీ 2002 ఫైనల్లో లార్డ్స్‌లో గంగూలీ చేసిన రచ్చ టీమిండియా అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇంగ్లాండ్‌పై చిరస్మరణీయమైన విజయం సాధించిన తరువాత కెప్టెన్ గంగూలీ బాల్కనీలో ఉద్వేగభరితంగా తన చొక్కా విప్పి సంబరాలు చేసుకున్నాడు.
2005లో టీమిండియాకు కోచ్‌గా గ్రెగ్ చాపెల్ నియమితులయ్యాడు. అయితే జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు, చాపెల్‌కు గొడవలు జరగడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. జింబాబ్వే టూర్లో గంగూలీ, చాపెల్ మధ్య వివాదంతో తెరపైకి వచ్చింది. ఇది గంగూలీ తన కెప్టెన్సీని కోల్పోవడానికి దారితీసింది. తరువాత జట్టులో స్థానం కూడా కోల్పోయాడు.
గ్రెగ్ ఛాపెల్‌తో వివాదంతో జట్టులో స్థానం కోల్పోయిన గంగూలీ.. తరువాత మళ్లీ జట్టులో స్థానం సంపాదించాడు. అయితే రిటైర్మెంట్ చేసిన కొన్నాళ్ల తర్వాత రాహుల్ ద్రవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చాపెల్‌తో వివాదం జరిగినప్పుడు ద్రావిడ్ తనకు మద్దతుగా ఏమీ చేయలేదని చెప్పాడు. సమస్య పరిష్కారం కోసం గంగూలీ తనని ఎప్పుడూ సంప్రదించలేదంటూ ద్రావిడ్కూడా కౌంటర్ ఇచ్చాడు.
సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీతో మధ్య వివాదం కూడా చర్చనీయాంశంగా మారింది. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని బీసీసీఐలో తనను ఎవరూ అడగలేదని మీడియాతో కోహ్లీ చెప్పగా.. గంగూలీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా గంగూలీ, కోహ్లీ ఒకరిఒకరు షేక్ ఇచ్చుకోలేని విషయం అందరికీ తెలిసిందే.