Shani Amavasya 2025: శని అమావాస్య నుంచి ఈ 2 రాశులకు నవయుగం.. ఇల్లు, వాహనయోగం.. కష్టాలకు ఫుల్‌స్టాప్‌

Shani Amavasya 2025 Lucky Zodiac Signs: శని అమావాస్య, సూర్యగ్రహణం ఒకే రోజు సంభవించనున్నాయి. ఆ తర్వాత రెండు రాశులకు అదృష్టం బంకలా పడుతుంది. ఈ సందర్భంగా వారు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.. మార్చి 29న శనివారం, అమావాస్య అదే రోజు సూర్యగ్రహణం కూడా సంభవించనుంది. అయితే అదృష్టం పట్ట పోతున్న రెండు రాశులు ఏంటో తెలుసుకుందాం..
 

1 /5

శనివారం, అమావాస్య కలిసి వస్తే శని అమావాస్య అంటారు. ఈ సారి అదే రోజు సూర్య గ్రహణం కూడా రానుంది. మార్చి 29న ఏడాది మొదటి సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఈ నేపథ్యంలో రెండు రాశులకు లక్‌ బాగా కలిసి వస్తుంది.  

2 /5

శని దేవుడి అపార కృప ఈ రాశులపై ఉంటుంది. శని సంచారం కూడా మారే సమయం. దీంతో రెండు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇన్ని రోజులు వీరు పడిన కష్టాలకు ఫుల్‌స్టాప్‌ పడే సమయం.. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్‌ చేయండి.  

3 /5

కర్కాటక రాశి.. శని దేవుడి అశేష కృప వల్ల కర్కాటక రాశి వారికి కొత్త యుగం ప్రారంభమవుతుంది. వీరికి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. అదృష్టం బంకలా పడుతుంది.. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. శనిదేవుని వల్ల వీరికి కొత్త ఉద్యోగాల్లో అవకాశం కూడా కలుగుతుంది. అంతేకాదు వాహనం లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

4 /5

మేష రాశి.. శని అమావాస్య తర్వాత మేషరాశికి వారికి కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవడమే కాకుండా కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి.. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అంతేకాదు మేషరాశి వారు కూడా భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.. జీవితం సాఫీగా సాగిపోయే సమయం.

5 /5

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)