Sankranthi Muggulu 2025: చుక్కలు లేకుండా వేసే సంక్రాంతి ముగ్గులు.. ఇలా సులభంగా ఇంటి ముందు వేయండి..

Sankranthi Bhogi Muggulu 2025: ఈ సంక్రాంతికి మీ ఇంటి ముందు మంచి డిజైన్తో కూడిన ముగ్గు వేయాలనుకుంటున్నారా? అది కూడా అతి తక్కువ సమయంలో.. అయితే ఈ డిజైన్స్ మీకోసమే.. ఎలాంటి చుక్కలు లేకుండా ఈ ముగ్గులను ఎంతో తొందరగా సులభంగా వెయ్యొచ్చు..
 

Sankranthi Muggulu Designs 2025: ఈ సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు మీ ఇంటి ముందు చాలా చక్కగా మంచి డిజైన్స్‌తో కూడిన ముగ్గులు వేయాలనుకుంటున్నారా? అందులో చుక్కలు లేకుండా మంచి ముగ్గులు వేయడానికి సిద్ధమయ్యారా? అయితే ఈ డిజైన్స్ మీకోసమే.. ఎలాంటి చుక్కలు లేకుండా సులభంగా తక్కువ స్పేస్‌లోనే మంచి ముగ్గులను వేయొచ్చు. దీనికోసం ఈ ప్రత్యేకమైన డిజైన్స్ ను పరిచయం చేయబోతున్నాం. ఈ ముగ్గులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 
 

1 /6

చాలామంది పెద్దపెద్ద ముగ్గులు కాకుండా సంక్రాంతి సందర్భంగా చిన్న ముగ్గులను వేసేందుకే ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేకమైన డిజైన్స్.. ఈ డిజైన్స్ ని అనుసరించి ఎంతో సులభంగా మీ ఇంటి ముందు ముగ్గులను పెట్టొచ్చు.   

2 /6

మొదటి డిజైన్ చూస్తే.. ఈ డిజైన్ లో ముందుగా ఒక పెద్ద ఫ్లవర్ వేసుకోవాల్సి ఉంటుంది.. ఈ ఫ్లవర్‌ను కలుపుకుంటూ మిగతా ముగ్గు డిజైన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ముగ్గు వేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా కలర్స్ కూడా ఫిల్ చేసుకోండి. 

3 /6

ఇక రెండవ డిజైన్ చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది.. ఎందుకంటే ఈ ముగ్గు చిన్నదైనప్పటికీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందుగా చాక్ పీస్‌తో ఈ ముగ్గుని గీసుకొని ఆ తర్వాత సుద్ధతో క్లియర్‌గా కనిపించేలా గీతలను గీస్తూ ముగ్గుని వేసుకుంటే భలే ఉంటుంది.  

4 /6

ఇక మూడో ముగ్గు చిన్న చిన్న ఫ్లవర్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఆరు పూలు చాలా అట్రాక్టింగ్ గా కనిపిస్తాయి. దీనికోసం ముందుగా ముగ్గులు మొత్తం గీసుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకొని అందులో కలర్స్ ఫిల్ చేసుకోండి. 

5 /6

ఇక ఈ ముగ్గు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండడం మీరు గమనించవచ్చు.. అయితే ఈ ముగ్గును గీయాలి అనుకునే వారు ముందు రోజు పేపర్ మీద ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. లేదంటే చాక్పీస్‌తో ముందుగా వేసి ఆ తర్వాత సుద్ధతో వేయడం చాలా మంచిది.

6 /6

ఎలాంటి చుక్కలు లేకుండా వేసుకునే ముగ్గులు ఇది ఒకటి.. ఈ డిజైన్ను గీయడం కూడా ఎంతో సులభం. ముందుగా చిన్న పువ్వుతో స్టార్ట్ అయ్యే ఈ డిజైన్ గీతలతో ఎండ్ అవుతుంది. ఈ డిజైన్ కూడా మీ ఇంటి ముందు ఒకసారి వేసి చూడండి.