Happy Sankranti 2025: తెలుగులో హ్యాపీ సంక్రాంతి విషెస్.. HD ఫొటోస్, కోట్స్..

Happy Sankranti 2025: హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో సంక్రాంతి పండగ ఒకటి.. ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉంటారు. పిండి వంటలతో, బసవన్న ఆటలతో మొదలయ్యే ఈ పండగ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. మీ మేలుకోరే వారికి ఇలా శుభాకాంక్షలను తెలియజేయండి.
 

Happy Sankranti 2025 Wishes In Telugu: ప్రతి ఏడాది మకర సంక్రాంతి సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకునే పండగ.. అయితే ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండగ జనవరి 15వ తేదీ సోమవారం వచ్చింది. మన పూర్వీకులు ఈ పండగ ను సూర్యుడికి అంకితం చేశారు. అందుకే ఈ రోజు చాలామంది సూర్యభగవానుడిని ఆరాధిస్తారు. ఈరోజు సూర్యభగవానుడిని ఆరాధించి.. ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల సంవత్సరం మొత్తం బాగుంటుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున మీరు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు బాగుండాలని మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి. 
 

1 /11

మనమంతా గడిచిన సంవత్సరం చేదు జ్ఞాపకాలను మరిచి.. ఆనందకరమైన మనసుతో సంక్రాంతి పండగ జరుపుకుందాం.. హ్యాపీ సంక్రాంతి..    

2 /11

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ.. సంక్రాంతి పండగ సిరులు తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.     

3 /11

సూర్య భగవానుడు మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ధనం, ఆనందం,  సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటూ.. హ్యాపీ సంక్రాంతి.  

4 /11

సంక్రాంతి పండగ రోజున ఉదయించే సూర్య కిరణాల నుంచి వచ్చే కాంతి మీ జీవితాల పై ప్రభావం చూపి.. జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సును నింపాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు.   

5 /11

సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేసినట్టు.. మీ జీవితం కూడా అద్భుతమైన దిశలోకి మలుపుతీరుగాలని కోరుకుంటూ.. మీ అందరికీ మకర సంక్రాంతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు.   

6 /11

ఈ సంక్రాంతి పండగ మీ జీవిత మార్గాన్ని సంతోషం, ఆనందం, శాంతి దిశగా మార్చాలని కోరుకుంటూ.. మీ అందరికీ మకర సంక్రాంతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు..  

7 /11

ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ మకర సంక్రాంతి..మీ కుటుంబాలకు అన్ని అందించాలని కోరుకుంటూ.. పేరుపేరునా ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.   

8 /11

మకర సంక్రాంతి వేళ మీ జీవితంలో మీకు ఎదురైన చేదు జ్ఞాపకాలు పూర్తిగా తొలగిపోయి.. అద్భుతమైన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. 

9 /11

సంక్రాంతి సందర్భంగా సూర్య భగవానుడి ప్రభావంతో మీ జీవితంలో ఉన్న గ్రహ ప్రతికూలతలు తొలగిపోయి.. ఆనందం దిశగా ముందుకు సహకాలని కోరుకుంటూ.. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.   

10 /11

సంక్రాంతి పండగ ప్రతి సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రశాంతంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి..    

11 /11

సరదాలు తెచ్చే సంక్రాంతి.. మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందాలను తీసుకురావాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి పేరుపేరునా హ్యాపీ సంక్రాంతి.