Sai Pallavi in saree: నాగచైతన్య, సాయి పల్లవి తండేల్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్.. ఈ మధ్యనే జరిగింది. ఇక ఈ ఈవెంట్ లోనే సినిమా యూనిట్ తాము త్వరలోనే తిరుపతి వెళుతున్నామని కూడా తెలియజేశారు.
చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ చిత్రం.. నాగచైతన్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుండి. ఇప్పటికే 80 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్లో కూడా చేరడానికి సిద్ధంగా ఉంది.
ఈ క్రమంలో ఈ సినిమా యూనిట్ ఈ మధ్యనే సక్సెస్ మీట్ కూడా జరిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్లో.. తాము తమ సక్సెస్ యాత్ర తిరుపతి నుంచి ప్రారంభించనున్నాము.. అని కూడా ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఈరోజు సినిమా యూనిట్ తిరుపతికి చేరుకొని.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత తిరుపతిలో థియేటర్ కి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్నారు చిత్ర టిమ్.
ఇక దర్శనానికి వెళ్ళినప్పుడు నాగచైతన్య, సాయి పల్లవి ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి ఎంతో పద్ధతిగా చీర చెంగుని కప్పుకొని తిరుమలలో కనిపించింది.
చీర కట్టుకోవడం వరకు సరే కానీ.. ఇలా పాత పద్ధతిలో చీర కొంగుని కూడా కప్పుకొని ఈ హీరోయిన్ కనిపించడంతో అందరూ మరోసారి ఆమెను మెచ్చుకుంటున్నారు.