ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమైంది. ఇందులో భాగంగా పూర్తి సనాతన వేషధారణలో దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుణక్షేత్రాల సందర్శన ఫోటోలు మీ కోసం..
Pawan Kalyan Temple Visit: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమైంది. ఇందులో భాగంగా పూర్తి సనాతన వేషధారణలో దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుణక్షేత్రాల సందర్శన ఫోటోలు మీ కోసం..
ఇవి నాలుగేళ్ల నాటి మొక్కులని..అందుకే ఆరోగ్యం సహకరించకపోయినా రావల్సి వచ్చిందన్నారు.
అంతకంటే ముందు కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగతమన్నారు. రాజకీయాలు సంబంధం లేదన్నారు.
పుణ్యక్షేత్రాల సందర్శనలో పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకిరా నందన్ ఉన్నారు.
ఆ తరువాత బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, మత్స్యమూర్తి , వేదవ్యాస, శివాలయం, శ్రీకృష్ణ ఆలయాలను సందర్శించారు.
శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారమైన శ్రీ పరశురామునికి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు.
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు పవన్ కళ్యాణ్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఇందులో భాగంగా కేరళలోని తిరుమల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు.
ఏపీ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శన చేపట్టారు.