The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్ ఇయర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అమోఘనమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తన నెక్ట్స్ మూవీకి ‘ది రాజా సాబ్’ మూవీతో పలకరించబోతున్నారు. మకర సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత ‘కల్కి 2898 ఏడి’ మూవీతో మరో సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 1100 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపాడు.
ఈ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా మరో లుక్ ను విడుదల చేశారు. పండగ కళతో ఉన్న ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ది రాజా సాబ్’ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ‘రాజా సాబ్’ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ది రాజా సాబ్’ మూవీని భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. " ది రాజా సాబ్" సినిమాను అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం తుది దశలో ఉంది.
ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
‘ది రాజా సాబ్’ మూవీ తర్వాత ప్రభాస్ నుంచి ‘సలార్ 2’, ‘కల్కి 2’ మూవీలతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ తో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాలున్నాయి.