Rashmika mandanna: ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్ అయిపోతున్న..!.. బాంబు పేల్చిన రష్మిక మందన్న..

Chhaava actress rashmika mandanna comments: రష్మిక మందన్న తాజాగా.. సినిమాల నుంచి  రిటైర్ మెంట్ తీసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
 

1 /6

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు. శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా మూవీ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో.. శంభాజీ పాత్రలో బాలీవుడ్ హీరో విక్కి కౌశాల్, శంభాజీ సతీమణి ఏసు బాయి పాత్రలో.. రష్మిక మందన్న నటిస్తున్నారు.

2 /6

చావా ట్రైలర్ ఇటీవల ముంబై వేదికగా జరిగింది. ఈ నేపథ్యంలో రష్మిక మాట్లాడుతూ.. మూవీలో ఏసుబాయ్ లా చేయడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ మూవీకి  లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. తనను ఈ మూవీలో హీరోయిన్ గా అది కూడా ఏసుబాయ్ పాత్ర కోసం ఎంపిక చేయడం గర్వంగా  ఉందన్నారు.  

3 /6

 ఈ మూవీలో మేకింగ్ సమయంలో.. విక్కి కౌశాల్ లో ఒక దేవుడిలా కన్పించాడన్నారు. తను పాత్రలో సీన్ లు తీస్తున్నప్పుడు చాలా సార్లు ఎమోషనల్ కు గురయ్యానని అన్నారు. ఈ సినిమా తీస్తున్నప్పుడు..డైరెక్టర్ తో గతంలో ఏసుబాయ్ పాత్రపట్ల ఎమోషనల్ అయ్యారు. ఒక నటిగా తనకు ఇంతకు మించి ఇంకేంకావాలని అన్నారు.  

4 /6

తాను ఆనందంతో రిటైర్ అవుతానని కూడా నటి రష్మిక అన్నారు.  మొదట ఈ పాత్రకోసం తనను ఎంపిక చేసినప్పుడు చాలా సార్లు రిహర్సల్స్ చేశానని చెప్పుకొచ్చారు. మరాఠి భాషను కూడా నేర్చుకునేందుకు ట్యూషన్ పెట్టించుకున్నట్లు నటి తెలిపారు.   

5 /6

ఈ సినిమాలో నటి లుక్ చాలా గంభిరంగా ఉంది. ఇప్పటి వరకు నవ్వుతూ.. ఫన్నీగా కన్పించిన రష్మిక.. మొదటి సారి ఒక కొత్త పీరియాడిక్ లుక్ లో అభిమానుల్ని అలరించబోతున్నారు. ట్రైలర్ చూశాక చాలా ఎమోషనల్ అయ్యానని..కూడా రష్మిక చెప్పారు.

6 /6

మరోవైపు రష్మిక మందన్న తన కాళ్లు ఫ్యాక్చర్ అయిన కూడా ముంబైలో ఈవెంట్ లో పాల్గొనేందుకు వచ్చారు. దీంతో ఆ సినిమా పట్ల రష్మికకు ఉన్న డెడికెషన్, మూవీ పట్ల తనకున్న అంకిత భావం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పాత్ర చేశాక.. ఇంకా లైఫ్ లో తిరిగి చూసుకొవాల్సిన అవసరం లేదని.. హ్యాపీగా రిటైర్ అవ్వొచ్చని కూడా రష్మిక చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.