Actress: భర్త మగాడు కాదు..మౌనంగా ఉండి నన్ను హింసించేవాడు.. షాకింగ్ వాక్యాలు చేసిన నటి

Farah Khan YouTube blog: బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫరా ఖాన్ తన యూట్యూబ్ బ్లాగ్ ద్వారా అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తన యూట్యూబ్ బ్లాగ్ లో.. అర్చన పురాన్ సింగ్ తో మాట్లాడుతున్నప్పుడు తన భర్త స్వలింగ సంపర్కుడు కాదని భావిస్తున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. 

1 /5

బాలీవుడ్లో భారీ పాపులారిటీ అందుకున్న లేడీ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇకపోతే ఇటీవలే ఈమె.. పెళ్లయిన తర్వాత ఆరు నెలలకే తన భర్త మగాడు కాదు అంటూ సంచలన కామెంట్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.   

2 /5

ఫరాఖాన్ ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూనే.. మరొకవైపు యూట్యూబ్ బ్లాగ్ లలో తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ బ్లాగులో అర్చనపురాన్ సింగ్తో మాట్లాడుతున్నప్పుడు తన భర్త మగాడు కాదని వెల్లడించింది.

3 /5

 ఆమె మాట్లాడుతూ.. మా వివాహమైన మొదటి ఆరు నెలలకే నా మొగుడు మగాడు కాదని తెలిసింది. మొదట చాలా కోపం వచ్చేది. ఎందుకంటే అతను ఏం చెప్పినా అక్కడే ఉండిపోయేవాడు. మౌనంగా ఉండి నన్ను హింసించేవాడు. 20 ఏళ్లుగా శిరీష్ నాకు క్షమాపణలు చెప్పలేదు. ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా తప్పు చేయలేదని భావిస్తాడు అంటూ ఆమె తెలిపింది.

4 /5

ఇకపోతే ఫరాఖాన్, శిరీష్ కుందర్ వివాహం జరిగి 20 సంవత్సరాలు అవుతోంది. వీరికి ముగ్గురు పిల్లలు దివా, అన్య, జార్. ఫరా 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోగా,  42 సంవత్సరాల వయసులో ముగ్గురు పిల్లలకు తల్లి అయింది. ఇక వీరిద్దరూ 'మై హూ నా' సినిమా షూటింగ్ సెట్లో కలుసుకున్నారు. ఒకరికొకరు ఇష్టపడలేదు. 

5 /5

కానీ క్రమంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే 2008లో ఐవీఎఫ్ ద్వారా వీరికి పిల్లలు పుట్టినట్లు సమాచారం. ప్రస్తుతం పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.