Rain Alert: రాష్ట్రప్రజలకు చల్లని కబురు.. రానున్న 5 రోజులపాటు వర్షాలు..!

Rain Alert Telangana: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి సగం నెల గడిచిపోయింది. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణశాఖ.

Rain Alert Telangana: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి సగం నెల గడిచిపోయింది. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణశాఖ. తెలంగాణ వ్యాప్తంగా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి సగం నెల గడిచిపోయింది. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణశాఖ. తెలంగాణ వ్యాప్తంగా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.  

2 /6

తెలంగాణ వ్యాప్తంగా ఎండ వేడిమి పెరిగిపోయింది. ఈసారి ఎండలు కూడా తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. అయితే, ఈసారి హోలీకి ముందు వానలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడుతోంది. దీంతో మామిడి, వరి, జొన్న చేనులకు విస్తృతంగా నష్టం వాటిల్లితోంది. ఈనేపథ్యంలో మరో 4 రోజుపపాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది.  

3 /6

ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు అంటే శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మండుటెండలో రాష్ట్రప్రజలకు చల్లని కబురు. ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. ఇప్పటికే నిజమాబాద్, మెదక్, వికారబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

4 /6

ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్లమేర ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా కురుస్తున్నాయి.

5 /6

సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు నిర్మల్, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది

6 /6

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )