Priyamani sister:పెళ్లయిన కొత్తలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రియమణి. గ్లామర్ ప్రాధాన్యతే కాకుండా నతన ప్రాధాన్యత ఉన్న సినిమాలలో కూడా కనిపించి అందరినీ మెప్పించింది. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ప్రియమణి చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి.
హీరోయిన్ ప్రియమణి గ్లామర్ పాత్రలు అలానే కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. హిందీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో, వెబ్ సిరీస్లో కనిపించి మెప్పించింది.
ఈ క్రమంలో ప్రియమణి ఒక హిందీ స్టార్ హీరోయిన్ కి బంధువు అని తెలియడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్.. ప్రియమణికి స్వయాన అక్క అవుతుందంట. ఈ విషయాన్ని ఈ హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. విద్యాబాలన్ తన తండ్రి తరపు బంధువులను చెప్పుకొచ్చింది ..
వారిద్దరూ బంధువులు అయినా కానీ.. తాము కలుసుకుంది ఇప్పటికి కేవలం రెండుసార్లే అని కూడా తెలియజేసింది ఈ హీరోయిన్.
మొదటిసారిగా వీరు విశాఖపట్నంలో జరిగిన అవార్డు వేడుకలో కలుసుకున్నారు. ఆ వేడుకలో విద్యా బాలన్ ఆమెకు అవార్డ్ అందజేసారు. ఆ తర్వాత, మరోసారి షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకలో కలుసుకున్నామని ప్రియమణి వెల్లడించారు.
ఇక ఈ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ప్రియమణి ఈ విషయం పలు ఇంటర్వ్యూలో చెప్పినప్పటికీ.. చాలామందికి ఇది తెలియక పోవడంతో.. అవునా నిజమా అని ఆశ్చర్యపోతున్నారు.