Maha kumbh mela: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు తరలిస్తున్నారు.
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళకు భక్తులు రోజు రోజుకు పొటెత్తుతున్నారు. జనవని 13న ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగియనుంది.ఈ క్రమంలో ప్రతిరోజు కూడా భక్తుల తాకిడి పెరుగుతునే ఉంది.
కుంభమేళలో ప్రస్తుతం పెరుగుతున్న రద్దీని బట్టి రైల్వే అధికారులు సైతం ప్రత్యేకంగా రైళ్లను నడిపిస్తున్నారు. చాలా మంది భక్తులు విమానాలు, రైళ్లు, బస్సులు, సొంత వాహానాలు,బోట్ లలో ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు.
ఇప్పటికే కుంభమేళ పుణ్యస్నానాల తేదీలను పొడించాలని యూపీలో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం సీఎం యోగికి రిక్వెస్ట్ చేశారు. గతంలో కుంభమేళాలు.. 75 రోజులు ఉండేవని.. ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో ఫిబ్రవరి 26తో కుంభమేళ ముగుస్తుందని, ఇంకా భక్తులు వస్తున్నారని అందుకే కుంభమేళ తేదీలను మరింత పొడించాలని కూడా కోరారు.
144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభమేళ కావడంతో మన దేశం నుంచి మాత్రమే కాకుండ.. ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు భారీగా కుంభమేళకు పొటెత్తుతున్నారు. ఇదిలా ఉండగా.. కుంభమేళలో విధుల్లో ఉన్న అధికారులకు ఇప్పటికే సూత్ర ప్రాయంగా మరికొన్ని రోజుల పాటు ఎక్స్ టెండ్ చేయోచ్చని కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు కుంభమేళలో 53 కోట్ల పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. మరికొన్ని రోజులు ఇంకా షాహీస్నానానికి మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి నేపథ్యంలో కుంభమేళలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని యోగి సర్కారు భావిస్తుంది.
మరోవైపు కుంభమేళ స్నానాలు పొడిగింపు పై యోగి సర్యారు కూడా ఆలోచనలు చేస్తుందని, అదే విధంగా ప్రస్తుతం విధుల్లో ఉన్నవాళ్లను రిలీవ్ చేయాలా..?.. లేదా వీరినే మరికొన్ని రోజులు పాటు విధులు పొడిగించాలా అన్న విధంగా కూడా ఆలోచనలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా భక్తులు, రాజకీయ నేతలు సైతం కుంభమేళను పొడిగిస్తే అందరికి పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉంటుందని కూడా యోగి సర్కారుకు అప్పీల్ చేస్తున్నారంట. దీనిపై ప్రభుత్వం అధికారింకంగా స్పందిస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు కుంభమేళలో 53 కోట్ల పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. మరికొన్ని రోజులు ఇంకా షాహీస్నానానికి మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి నేపథ్యంలో కుంభమేళలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని యోగి సర్కారు భావిస్తుంది.