Pragya jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ ఉన్న.. అందుకు తగ్గట్టు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు మాత్రం ప్రగ్యాకు రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్‌లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్.. తాజాగా ‘డాగు మహారాజ్’ వంటి సక్సెస్ ఉణ్న ఈమె కెరీర్ అనుకున్నంత పుంచుకోలేదు. అందుకే ఛాన్సుల కోసం హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లో 'అఖండ' వంటి సూపర్ హిట్ ప్రగ్యా కెరీర్ లో ఉన్నా.. సూర్యుడి వెలుతురు ముందు చంద్రుడు వెలవెల పోయినట్టు ఆమె నటించి సినిమా సక్సెస్ అయినా.. క్రెడిట్ మాత్రం బాలయ్య ఖాతాలోకే వెళ్లింది.
అఖండ తర్వాత మరోసారి బాలయ్య సరసన నటించిన ‘డాకు మహారాజ్’ మూవీతో సంక్రాంతికి పలకరించింది. ఈ మూవీ సక్సెస్ అయినా.. ప్రగ్యాకు పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. త్వరలో అఖండ 2లో కూడా నటిస్తోంది. ఇందులో ప్రగ్యాతో పాటు సంయుక్త మీనన్ కూడా నటిస్తోంది.
ప్రగ్యా.. టాలీవుడ్ లో 'మిర్చిలాంటి కుర్రాడు' మూవీతో లెగ్ పెట్టింది. ఇక క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
కంచె మూవీ తర్వాత వరుసగా తెలుగులో 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సన్ ఆఫ్ ఇండియా వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలేవి అమ్మడికి పెద్దగా అవకాశాలు దక్కేలా చేయలేదు. హిందీలో గతేడాది ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాతో పలకరించింది.
ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్ కాక ముందు మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి నటిగా కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.