2025 Holiday planning: ఎవరైనా సరే కొత్త ఏడాది ప్రారంభం అవుతుందంటే చాలు.. ఆ ఏడాది మొత్తం ఎన్ని సెలవులు వస్తాయి.. ఎక్కడెక్కడికి వెళ్ళవచ్చు అని ఇప్పుడే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే..మీకు ఒక ఇప్పుడు చెప్పబోయేది తప్పకుండా పెద్ద శుభవార్త అవుతుంది.
సాధారణంగా పిల్లలను మొదలుకొని పెద్దల వరకు హాలిడే వచ్చిందంటే చాలు.. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్త ఏడాది ప్రారంభమైందంటే ఇంకా ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలోనే మరో నాలుగు రోజుల్లో కొత్త ఏడాది రాబోతున్న నేపథ్యంలో.. ఈ ఏడాది పొడవునా ఎన్ని సెలవులు వస్తాయి? ఈ సెలవులను ఎలా ఉపయోగించుకోవాలని? అని ఎంతోమంది అప్పుడే ఆలోచించడం మొదలుపెట్టారు.
ఇక మీరు కూడా వచ్చే ఏడాది సెలవుల కోసం ఎదురుచూస్తూ.. ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. మీకు ఒక శుభవార్త చెప్పవచ్చు. అదేమిటంటే..మీరు వచ్చే ఏడాదిలో 12 రోజులు లీవ్ తీసుకుంటే కనుక మొత్తం 50 రోజులు మీకు కలిసి వస్తాయి. అది ఎలాగో ఎప్పుడు చూద్దాం.
జనవరి 13వ తేదీన లీవ్ తీసుకుంటే.. జనవరి 11, 12, 13, 14 ఆలా మొత్తం నాలుగు రోజులు హాలిడేస్ వస్తాయి. ముఖ్యంగా మకర సంక్రాంతికి ఈ నాలుగు రోజులు బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ఫిబ్రవరిలో 24, 25, 27, 28 లీవ్ తీసుకున్నట్లయితే 22నుంచి మార్చ్ 2 తేదీ వరకు మొత్తం తొమ్మిది రోజులు సెలవులు పొందవచ్చు.
మార్చి నెలలో రెండు వీకెండ్స్ వస్తాయి. 14, 15, 16, 29, 30, 31 తేదీలలో ఆరు రోజులు సెలవులు పొందవచ్చు. 14వ తేదీ హోలీ, 31వ తేదీ ఈద్ కలిసి వస్తాయి. ఏప్రిల్ 18వ తేదీ గుడ్ ఫ్రైడే, మే 1వ తేదీ కార్మికుల దినోత్సవం సెలవులను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఆగస్టు నెలలో 25, 26, 28, 29 రోజులు లీవ్ తీసుకుంటే మొత్తం 12 రోజులు సెలవులు పొందవచ్చు. అక్టోబర్ నెలలో 2, 3, 4, 5 తేదీలు గాంధీ జయంతి, దసరా సెలవులతో కలిసి వస్తాయి. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్, 26, 27, 28 తేదీలతో నాలుగు రోజులు కలవుతాయి.
మొత్తం చూసుకుంటే మీరు కేవలం 12 రోజులు లీవ్ తీసుకుంటే, దాదాపు 50 రోజుల హాలిడేలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మీ ట్రిప్ మరింత ఆనందంగా మారుతుంది.