Nitish Kumar Reddy: మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన నితీశ్‌ కుమార్ రెడ్డి.. వీడియో చూశారా..!

Nitish Kumar Reddy Climbs Tirumala Steps: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆల్‌రౌండర్ నితీశ్‌ కుమార్ రెడ్డి అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. టాప్ బ్యాటర్లు సైతం ఇబ్బంది పడిన పిచ్‌లపై అదిరిపోయే ఆటతీరుతో దుమ్ములేపాడు. టీమిండియా సిరీస్‌ ఓడిపోయినా.. నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ ఇన్నింగ్స్ మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హఫ్‌ సెంచరీ తరువాత తగ్గేదేలే అంటూ బ్యాట్‌తో సంబరాలు చేసుకోగా.. సెంచరీ తరువాత బాహుబలి మూవీలో ప్రభాస్ తరహాలో సంబరాలు చేసుకున్నాడు. ఇక ఆటలోనే కాదు భక్తిలోనూ తగ్గేదేలే అని ఈ యంగ్ క్రికెటర్ నిరూపించాడు. మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది. 

 

 

 

1 /5

ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బ్యాట్‌తో అదిరిపోయే ఇన్సింగ్స్‌ ఆడాడు నితీశ్ రెడ్డి. మెల్‌బోర్న్‌ జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతక్కొట్టాడు.   

2 /5

త్వరలో ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. టెస్ట్‌ ఫార్మాట్‌లో ప్లేస్ ఫిక్స్‌ చేసుకున్న నితీశ్.. వైట్ బాల్ క్రికెట్‌లోనూ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు.  

3 /5

ఇటీవల వైజాగ్ చేరుకున్న నితీశ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగత లభించింది. ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపుగా వెళ్లిన విషయం తెలిసిందే.  

4 /5

తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారికి మొక్కులు చెక్కించుకున్నాడు. మోకాళ్లపై శ్రీవారి మెట్లు ఎక్కుతున్న వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.   

5 /5

తనకు మంచి రోజులు నడుస్తున్నా.. దేవుడిని మర్చిపోలేదంటూ నెటిజన్లు నితీశ్‌ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని.. మోకాళ్లపై మెట్లు ఎక్కే క్రమంలో గాయాలు అయ్యే అవకాశం ఉందని మరికొందరు సూచిస్తున్నారు.