Thandel 1st Week Box Office collection: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న తండేల్.. చాలా యేళ్ల తర్వాత చైతూకు సోలో హిట్..

Thandel 1st Week Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించింది. తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

1 /6

Thandel 1st Week Box Office collection: తండేల్ మూవీలో తండేల్ రాజుగా నాగ చైతన్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు  సాయి పల్లవి తన అద్బుత నటనతో ఆకట్టుకుంది. చందూ మొండేటి  తన దర్శకత్వంతో ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాడు.

2 /6

అంతేకాదు నటీనటులతో మంచి నటన రాబట్టుకొన్నాడు.   అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీ వాస్ తెరకెక్కించిన ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ ఈ సినిమాకు కలిసొచ్చింది. ‘తండేల్’ మూవీ మొదటి మూడు రోజులు మంచి వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాదు సోలో హీరగా అత్యధిక ఫస్ట్ డే తో పాటు ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.

3 /6

సోమవారం నుంచి హోల్డ్ చూపించిన ఈ చిత్రం ఫస్ట్ డే  ప్రపంచ వ్యాప్తంగా  రూ. 21 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఫస్ట్ వీక్ లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల షేర్ (రూ. 91 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. త్వరలో రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడం పక్కా అని చెప్పొచ్చు.

4 /6

చందూ మొండేటి ఈ చిత్రాన్ని లవ్ కమ్ యాక్షన్, ఎమోషన్ తో కూడి దేశ భక్తి  చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాడు. మొత్తంగా నాగ చైతన్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొత్తంగా విడుదలైన వారం రోజుల్లోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

5 /6

మొత్తంగా ‘థాంక్యూ’, ‘కస్టడీ’ వంటి బ్యాక్ బ్యాక్ ఎపిక్ డిజాస్టర్స్ తర్వాత వచ్చిన ‘తండేల్’ మూవీతో హీరోగా నాగ చైతన్య వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. మొత్తంగా శోభితతో రెండో పెళ్లి తర్వాత హీరోగా చైతూ కెరీర్ పుంజుకోవడం అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

6 /6

‘తండేల్’ మూవీలో  నాగ చైతన్య ‘తండేల్ రాజు’ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. అటు సాయి పల్లవి ‘సత్య’ పాత్రలో జీవించింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.