Matka First Review: మెగా హీరో కెరీర్ ఒక అడుగు ముందుకు... రెండగులు వెనక్కి అన్నట్టు తయారైంది వరుణ్ తేజ్ పరిస్థితి. తాజాగా ఈయన కరుణ్ కుమార్ డైరెక్షన్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ గురువారం విడుదల కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Matka First Review: వరుణ్ తేజ్.. దగ్గర మస్తు టాలెంట్ ఉన్నా.. సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత వరుణ్ తేజ్ కు సక్సెస్ అన్నదే లేదు. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఆపరేషన్ వాలంటైన్’ మూవీ బాగున్నా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం కాలేదు.
తాజాగా ఈయన కరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ సినిమాతో పలకరించాడు. ఇప్పటికే విడుదలైన విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో వరుణ్ రెట్రో లుక్ లో అలరిస్తున్నారు. అంతేకాదు వివిధ వయసులకు సంబంధించిన ట్రాన్స్ ఫార్మేషన్ బాగుంది.
వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’ సినిమా కు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ. 17.50 కోట్లు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ. 18.30 కోట్ల షేర్ రాబడితే హిట్ అనిపించుకుంటుంది.
పైగా సూర్య ‘కంగువా’ వంటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనబోతుంది. మరోవైపు వరుణ్ తేజ్.. వరుస ఫ్లాపుల్లో ఉండటం ఈ సినిమాపై ఇంపాక్ట్ పడే అవకాశాలున్నాయి.
‘మట్కా’ అంటే జూదం. ఈ నేపథ్యంలో ముంబై బ్యాక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఆనాటి విజువల్స్ అన్ని బాగున్నాయి. ఆర్ట్ వర్క్ పనితనం కనిపిస్తోంది. వరుణ్ తేజ్..గద్దలకొండ గణేష్ తర్వాత మరోసారి డాన్ పాత్రలో నటించాడు. ముఖ్యంగా హాజీ మస్తాన్, వరద రాజన్ మొదలియార్, దావూడ్ ఇబ్రహీం వంటి డాన్ ల జీవిత నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడా అనే డౌట్స్ వస్తున్నాయి.
పైగా మట్కా స్టోరీ చూస్తుంటే.. కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలను గుర్తుకు తెస్తున్నాయి. ఓ మామలు వ్యక్తి డాన్ గా ఎలా ఎదిగాడనే కాన్సెస్ట్ ఎన్నో సినిమాల్లో చూసిందే. మరి దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను ఎలా డీల్ చేసాడనే దానిపై ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. హీరోగా వరుణ్ ట్రాన్స్ ఫార్మేషన్ బాగుంది. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.