Aghora Vs Naga Sadhu: అఘోరాలకు, నాగ సాధువులకు ఉన్న తేడాలు ఇవే..!

Mahakumbh Mela 2025: ఇంతకీ కుంభమేళాలో రాజస్నానానికి వచ్చే అఘోరాలకు, నాగ సాధువులు ఒక్కటనే భ్రమలో చాలా మంది ఉన్నారు. అవును వీరిద్దరు హిందూ ధర్మ రక్షణ కోసం పాటు పడేవారే. వీళ్లిద్దరిలో ఉన్న తేడాలేమిటో చూద్దాం..

1 /9

Mahakumbh Mela 2025: కొందరికి తెలియని విషయము ఏమిటంటే అఘోరాలు వేరు.. నాగ సాధువులు వేరు. నాగ సాధువులు పూర్తి శాకాహారులు. వీరు నేల పైనే నిద్రిస్తుంటారు. రోజులో ఒక సారి మాత్రమే భుజించాలనే నియమం ఉంది.

2 /9

వీరు భిక్షాటన ద్వారా తమ ఆహరాన్నివారే సంపాదించుకుంటారు. అది కూడా రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి. ఆ ఇంటి వారు ఏది ఇచ్చిన అది మహా ప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమీ ఎవ్వనిచో శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిందే.

3 /9

అంతేకాదు నాగ సాధువులు దిగంబరంగానే  జీవిస్తుంటారు. వీరు నాగ సాధువుగా  శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగ వస్త్రం మాత్రమే ధరిస్తారు.  శిక్షణ కాలం పెరిగేకొద్దీ విభూది, రుద్రాక్షలు మాత్రమే వీరి ఆభరణాలు. 

4 /9

నాగ సాధువులు ప్రధానంగా ఐదుగురు ప్రధాన దేవతలను మాత్రమే పూజిస్తారు. మొదటిగా శివుని , శక్తి అమ్మవారిని,  వినాయకుని , విష్ణువు, సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు.

5 /9

అఖాడాలకు వచ్చిన వారికి అంచె అంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది...ముందుగా వీరు అవధూతగా మారాలి. గుండు చేయించుకొని వారి కర్మ కాండలను వారే నిర్వహించుకోవాలి. పిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి నాగ సాధువులుగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతువస్తుంది.

6 /9

మొదటగా (1) నాగ సాధువుగా, (2) మహంతగా, (3) శ్రీ మహంతగా, (4) జమతియా మహంతగా, (5) పీఠ మహంతిగా, (6) దిగంబర శ్రీ గా, (7) మహా మండలేశ్వరుడిగా, చివరిగా (8) ఆచార్య మండలేశ్వరుడిగా పదవులనేవి ఉంటాయి.

7 /9

చివరి వరకు వెళ్లలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడి పోతుంటారు.వీరు హిందు పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా తీయటనికైనా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారీనా వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది.

8 /9

వీరు ఏంత కాలమైన నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు. వీరు మనుష్యలకు కనిపించేందుకు ఇష్టపడరు. హిమాలయాల నడుమ కొండ గుహలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటారు.

9 /9

కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే సూక్ష్మ రూపులుగా దేశం నలుమూలల సంచరిస్తుంటారు. ధర్మ పరిరక్షణ గాడి తప్పిన రోజున కాల రుద్రులుగా మారుతుంటారు.శిక్షణ లో ఉన్న నాగ సాధువులను మనం కాశీ, హరిద్వార లో చూడవచ్చును