Naga Sadhu: ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని గంగ, యుమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో జరుగుతోంది. ఇక్కడ భక్తులతో పాటు సామాన్యులను అందరికీ ఆకర్షిస్తున్నారు నాగ సాధువులు.ఒక వ్యక్తి శివ గణాలుగా పిలవబడే నాగ సాధువులు కావడానికి ఎలాంటి కఠోర దీక్షలు చేస్తారు. వాటి వెనక ఉన్న మర్మం ఏమిటనే విషయానికొస్తే..
Naga Sadhu: ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరగుతోన్న మహా కుంభమేళాలో అందరినీ ఆకర్షిస్తున్నారు వివిధ అఖాడాలకు చెందిన అఘోరాలు, నాగ సాదువులు. అందులో నాగ సాధువుగా మారడానికి ఉన్న నియమ నిబంధనల విషయానికొస్తే.. ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి ముందుగా తనకు సంబంధించిన అన్ని భవ బంధనాలను వదులుకోవాలి.
ఇక కుంభమేళా జరిగే సమయంలో భక్తులు ముందుగా నాగ సాదువులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. వీరు ధరించే విభూది నామాలు, రుద్రాక్షల ద్వారా ఏ అఖాడాకు చెందిన వారో అక్కడున్న వారికీ తెలుస్తుంది.
ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి ముందుగా అఖాడా పెద్దలను కలసి వారి వివరాలు తెలియ జెయ్యాలి. నాగ సాదువులు మారాలనుకునే వారు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు. అక్కడే వద్దని ముఖం మీదే చెప్పేస్తారు. ఒక సారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు.
నాగ సాదువులుగా మారాలనుకునే వ్యక్తులకు ఆయా అఖాడాల్లో 6 నెలలు నుండి 12 సంవత్సరాలు వరకు యోగా, ధ్యానం వంటి వాటిల కఠోర శిక్షణ ఇస్తారు.
మన మహా ఋషులు తపస్సు అనే పేరుతో ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు.నాగ సాదువులుగా కూడా నిరంతరం శివనాస్మరణను చేస్తూనే జీవితాన్ని గడుపుతుంటారు.
అంతేకాదు దుష్ట శిక్షణార్ధం త్రిశూలం చేత శిష్ట రక్షణ చేస్తుంటారు. ఎక్కుడైతే హైందవానికి అధర్మం పెచ్చురుల్లుతుందో అక్కడ ధర్మ సంస్థాన చేస్తుంటారు.