Monalisa Bhosle: కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలీసా నక్క తోకను తొక్కినట్లుంది. సోషల్ మీడియా పుణ్యామాని ఆమె ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఏకంగా స్టార్ దర్శకుడు ఆమెకు సినిమాలో హీరోయిన్గా కూడా అవకాశం ఇచ్చాడు.
ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళ జరుగుతుంది. దీనిలోన మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన యువతి మోనాలీసా పూసలు అమ్మి తన కుటుంబాన్ని పొషించుకుటుంది. అయితే.. ఆమెకళ్లు చాలా అందంగా ఉంటాయి. ఆమె చూసేందుకు కూడా అచ్చం హీరోయిన్గా ఉంటుంది.
దీంతో చాలా మంది ఆమె వీడియోలు , ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చి పడింది. కుంభమేళకు వెళ్లిన వారు తప్పకుండా.. మోనాలీసాను చూసేంత పబ్లిసిటీని ఆమె సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఫెమస్ దర్శకుడు సనోజ్ మిశ్రాతాను తీస్తున్న మణిపూర్ డైరీస్ లో మోనాలీసాకు హీరోయిన్ గా అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు .అంతే కాకుండా.. ఆమెకు హీరోయిన్ గా కావాల్సిన మెళకువల్ని దగ్గకుండా.. కోచింగ్ కూడా ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో మోనాలీసా ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది.
ఇటీవల కేరళలో ఆమె జువెల్లరీ షాపింగ్ మాల్ ను ఇనాగ్రేట్ చేసేందుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఆమె తొలిసారి ఫైవ్ స్టార్ హోటల్ లో తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేసింది. విమానంలో కూడా ప్రయాణించింది. అదే విధంగా జువెల్లరీ షాపులో ఆమెకు డైమండ్ నెక్లెస్ సైతం ఇచ్చారు.
మరోవైపు కుంభమేళ బ్యూటీ తమ ప్రాడక్ట్స్ కు అంబాసీడర్ గా ఉండాలని అనేక కంపెనీలు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే.. ఈ బ్యూటీకి ప్రస్తుతం మరో లక్కీ చాన్స్ వచ్చి పడింది. ఆమెకు ఫిబ్రవరి 26న నేపాల్ లో జరిగే మహాశివరాత్రి ఈవెంట్ కు రావాల్సిందిగా స్పెషల్ గా ఆహ్వానం అందింది.
దీంతో కుంభమేళ బ్యూటీ ఫుల్ ఖుషీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఆమెతో సినిమా తీస్తున్నసనోజ్ మిశ్రాస్వయంగా మోనాలీసా మహా శివరాత్రికి నేపాల్ వెళ్తారని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలీసా మరోసారి వార్తలలో నిలిచింది.