Ktm 390 Duke Price Drop: KTM నుంచి అద్భుతమైన ఆఫర్‌.. భారీగా తగ్గిన ధర..


Ktm 390 Duke Price Drop: భారతీయ యువతకు ఎంతో ఇష్టమైన మోటర్‌సైకిల్స్‌లో KTM 390 డ్యూక్ ఒకటి.. ఈ స్పోర్ట్‌ బైక్‌కి మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అయితే మీరు కూడా ఈ మోటర్‌సైకిల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.  KTM 390 డ్యూక్ పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీనిపై అదనంగా స్పెషల్ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. 
 

1 /5

మార్కెట్‌లో KTM 390 డ్యూక్ బైక్‌ ధర  రూ. 3.13 లక్షలు కాగా ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా రూ.18,000 తగ్గింపుతో కేవలం రూ.2.95 లక్షలకే అందుబాటులో ఉంది. అలాగే దీనిపై అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

2 /5

KTM 390 డ్యూక్ అద్భుతమైన స్పోర్ట్స్‌ లుక్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ జనరేషన్-3 ప్లాట్‌ఫామ్‌పై  నిర్మించినట్లు తెలిపింది. ఈ మోటర్‌ సైకిల్ అద్భుతమైన హ్యాండ్లింగ్‌తో పాటు ప్రీమియం ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉంటుంది.   

3 /5

ఈ శక్తివంతమైన మోటర్‌సైకిల్‌లో వివిధ ప్రత్యేకమైన మోడ్స్‌తో పాటు లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, రైడర్ ఎయిడ్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఇది అతి శక్తివంతమైన లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ 399cc ఇంజన్‌తో లభిస్తోంది. 

4 /5

ఈ మోటర్‌సైకిల్ ఇంజన్‌ 45.37 bhp శక్తిని ఉత్పత్తి చేయడమే కాకుండా 39 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలిపింది. అలాగే ఇది స్పెషల్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. దీంతో పాటు అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.   

5 /5

ఇక ఈ మోటర్‌సైకిల్‌లో  కలర్ TFT డిస్ప్లే మెనును కూడా అందిస్తోంది. దీనికి తోడు బైక్ లాంచ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే అదనంగా  బ్లూటూత్ కనెక్టివిటీని కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు నావిగేషన్ సపోర్ట్‌ కూడా లభిస్తోంది.