Karthika masam 2024: కార్తీకంలో ఈ పనులు మర్చిపోయి కూడా చేయోద్దు..పండితులు ఏమంటున్నారంటే..?

Karthika masam Tradition:  కార్తీకంను చాలా మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే.. కార్తీకంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. దీని వల్ల జీవితంలో మంచి మార్పులు జరుగుతాయని చెబుతుంటారు.

1 /6

కార్తీకంను హిందు సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెల రోజుల పాటు మనం చేసే ప్రతి మంచి పనికూడా.. వందరేట్లు గొప్ప ఫలితాలను కల్గజేస్తుందని చెబుతుంటారు. 

2 /6

అందుకే కార్తీకంలో పూజలు, వ్రతాలు, దానాలు చేయాలని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా.. ఈ నెలలో ఎలాంటి కార్యక్రమాలు చేసిన కూడా మనకు వెయ్యిరెట్లు మంచి ఫలితాలు కల్గుతాయంట.

3 /6

ఆషాడ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లిని విష్ణుదేవుడు మళ్లీ కార్తీకంలో నిద్ర నుంచి మేల్కొంటాడంట. అందుకే కార్తీకంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివ, కేశవులకు ఎలాంటి పూజలు చేసిన కూడా మంచి జరుగుతుంది.

4 /6

ఈ మాసంలో మద్య, మాంసాలకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా... ఇంట్లో మహిళలు బహిష్టులుగా ఉన్న సమయంలో దేవత పూజలకు మూడు రోజులపాటు దూరంగా ఉండాలి. ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడుకొవడం వంటి పనులు చేయకూడదు.  

5 /6

కార్తీకంలో ముఖ్యంగా దేవతల ఆలయాలకు, పేదలకు మనకు వీలైనంత సహాయం చేయాలి. కార్తీక ద్వాదశి రోజున తులసీ వివాహాం జరిపించాలి. పౌర్ణమిరోజున 365 వత్తుల దీపం వెలిగించాలి. అంతే కాకుండా.. విష్ణువుకు ప్రత్యేకమైన సత్యనారాయణ వ్రతం చేయాలి.  

6 /6

అంతే కాకుండా.. ఉపవాసాలు చేస్తుంటే మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకొవాలి. ప్రతిరోజు సాత్విక ఆహారం తింటూ... దేవుళ్లను ఆరాధిస్తు వీలైంతగా మంచి ఆలోచనలతో ఉండాలని పండితులు చెబుతున్నారు.