PF Balance Check: పీఎఫ్‌ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి.. సింపుల్ స్టెప్స్ మీ కోసం..!

How to Check PF Balance: చాలామంది ఉద్యోగులకు తమ పీఎఫ్‌ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఇబ్బంది పడకుండా చాలా సింపుల్‌గా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఎస్ఎంఎస్, మిస్డ్‌కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
 

1 /6

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై ప్రస్తుతం 8.25 శాతం వడ్డీ రేటు ఉంది. వడ్డీని నెలవారీగా లెక్కించి ఆర్థిక సంవత్సరం చివరలో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు.  

2 /6

పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకోవాలంటే.. https://unifiedportal-mem.ePFindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. మీ UAN నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సైట్ ఓపెన్ అయిన తరువాత ఈ పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత లాగిన్ అయి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.  

3 /6

మీ మొబైల్‌లో UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి. మీ UAN నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. పేజీ ఓపెన్ అయిన తరువాత వ్యూ పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.   

4 /6

ఎస్ఎంఎస్ ద్వారా కూడా పీఎఫ్‌ బ్యాలన్స్ చూసుకోవచ్చు. పీఎఫ్‌ ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ నుంచి 7738299899కి 'EPFOHO UAN' అని SMS చేయాలి.   

5 /6

మీ మొబైల్ నంబరు నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ నంబరుకు ఎస్ఎంఎస్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.   

6 /6

ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటుపై అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక శాఖ ఆమోదం తరువాత ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటును అందిస్తుంది.