Karthika masam 2024: కార్తీక మాసంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు. మిగత మాసాలకన్న.. కార్తీకంలో మనం చేసిన దేవత పూజలు, వ్రతాలకు రెట్టింపు ఫలితం కల్గుతుందని చెప్తుంటారు.
కార్తీక మాసంను ప్రజలు ఎంతో భక్తి భావనలతో ఉంటారు. ఈ మాసం శివ, కేశవులకు ఎంతో ప్రీతీకరమైందని చెప్పుకొవచ్చు. నెలరోజుల పాటు దీపారాధాన చేయాలి
ముఖ్యంగా సూర్యోదయం ముందు నిద్రలేచి స్నానా సంధ్యాదులు పూర్తి చేసుకొవాలి. ఇంట్లో లేదా ఆలయంలో దీపారాధన చేయాలి.
కార్తీక మాసంలో అన్నింటికన్న కూడా పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెబుతుంటారు. ఈరోజున చేసేపనులు వంద రెట్లు మంచి ఫలితాలను ఇస్తాయంట.
ఈ సారి కార్తీక పౌర్ణమి నవంబరు 15 వ తేదీనాడు వస్తుంది. ఈరోజంతా చాలా మంచిరోజని పండితులు చెబుతుంటారు. ఈరోజు ఎలాంటి పనులు చేసిన అవి ఆగకుండా పూర్తవుతాయి.
అంతే కాకుండా.. ఈ రోజు ముఖ్యంగా 365 వత్తులతో దీపారాధన చేస్తారు. దీని వల్ల సంవత్సరంలో మనం దీపారాధన చేయకున్న.. ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే ఏడాది దీపం పెట్టిన పుణ్యం వస్తుందంట.
అదే విధంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి పండు లేదా సాలగ్రామం దానంగా ఇవ్వాలి, ఆవులకు పశుగ్రాసం దానంగా ఇవ్వాలి. ఈరోజు ఉపవాసం ఉంటే కూడా ఎంతో పుణ్యమని చెబుతుంటారు.