Jio: జియో 72 రోజుల నయా ప్లాన్‌ .. బీఎస్‌ఎన్‌ఎల్‌కు బిగ్‌ షాక్, ఫ్రీ జియో సినిమాతోపాటు బంపర్ బెనిఫిట్స్..

Jio 72 Days Recharge Plan: టెలికాం కంపెనీ మరో సూపర్ హిట్ ప్లాన్‌ యూజర్లకు బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఆఫర్ తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ కంపెనీ బిఎస్ఎన్ఎల్ , ఎయిర్‌టెల్‌కు బిగ షాక్‌ ఇస్తుంది. ఇటీవల బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ధరలు కూడా పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.749 నయా ప్లాన్ తో జియో సినిమాలు కూడా ఉచితంగా అందిస్తూ ఆకట్టుకుంటుంది..  ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

 పెరిగిన టెలికాం ధరల తర్వాత చాలామంది జియో యూజర్లు బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్‌ అయ్యారు. ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ తక్కువ ధరలోనే అందుబాటులో ఉండడంతో ఇలా ఎక్కువ శాతం మందిని జియో కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 72 రోజుల జియో ప్లాన్ అద్భుతంగా బెనిఫిట్స్ అందిస్తోంది. ఇది ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటుంది.  

2 /5

ఈ ప్లాన్ ధర రూ.749 బడ్జెట్ ఫ్రెండ్లీ అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం. ఈ రీఛార్జీ ప్లాన్‌ రూ. 749 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. అంతేకాదు ఫ్రీ లోకల్, ఎస్టిడి ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా ఫోన్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు.  

3 /5

ఈ 72 రోజుల ప్లాన్ లో ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా పొందుతారు. అంటే ప్లాన్ మొత్తంలో 144 జీబీ అందుకుంటారు. ఇది కాకుండా అదనంగా 20 జిబి అదను డేటా కూడా పొందుతారు. అంటే మొత్తం 164 జీబీ పొందుతారు . మీ ఏరియాలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే అపరిమిత 5జి డేటా పొందుతారు.  

4 /5

ఇవి కాకుండా అదనంగా ఈ ప్యాక్ తో రీఛార్జ్ చేసుకుంటే జియో సినిమా ఉచితంగా పొందుతారు. అంటే అదనపు ఖర్చు లేకుండా సినిమాలను ఫ్రీగా ఆస్వాదిస్తారు. జియో టీవీ ఛానల్స్ కూడా ఫ్రీగా పొందుతారు. ఇంకా జియో కాంప్లిమెంటరీ క్లౌడ్ స్టోరేజ్ కూడా యూజర్లు ఉచితంగా పొందుతారు.  

5 /5

 అంటే రూ.749 రూపాయలతో లాంగ్ టైం వాలిడిటీ ఆప్షన్ మాత్రమే కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ , హై స్పీడ్ డేటా తో పాటు జియో క్లౌడ్ ఉచితంగా పొందుతారు. ఎంటర్‌టైన్మెంట్‌ కూడా ఉచితంగా ఆస్వాదిస్తారు.