Janhvi Kapoor interesting comments: దేవర బ్యూటీ జాన్వీకపూర్ తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల కరణ్ జోహార్ షోలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
శ్రీదేవీ కూతురు జాన్వీకపూర్ తరచుగా ట్రెండింగ్ లో ఉంటారు. ఒక వైపు ఈ భామ గ్లామర్ తో కుర్రాకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మరోవైపు ఈ అమ్మడికి భక్తి కూడా ఎక్కువే. అందుకే సమయం దొరికినప్పుడల్లా తిరుమలలోను వాలిపోతుంటుంది.
ఈ ఏడాది ప్రారంభంలో.. అమరన్ మూవీ చూసిన ఈ చిన్నది.. సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా.. గతేడాది చూసిన బెస్ట్ సినిమాల్లో అమరన్ ఒకటని కూడా వ్యాఖ్యలు చేసింది.
వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో జాన్వీకపూర్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో తెలుగులో ఈ భామ దేవరలో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ భలే సెట్ అయ్యిందని కూడా అభిమానులు పండగ చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. జాన్వీకపూర్ ఇటీవల కరణ్ జోహార్ షోలో పార్టీసిపేట్ చేసింది.ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని చెప్పింది.
అంతే కాకుండా.. భర్త, ముగ్గురు పిల్లలతో తిరుమలలో హాయిగా గడపాలనుందనే విషయంను అభిమానులతో పంచుకుంది. ప్రతిరోజు అరటి ఆకులో అన్నం తింటూ... గోవిందా గోవిందా అని స్మరించుకోవాలనుందని చెప్పింది. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ ఏంచక్కా ఎంజాయ్ చేయాలని ఉందని తెలిపింది.
ఈ క్రమంలో ప్రస్తుతం జాన్వీకపూర్ తన పెళ్లి, పిల్లలు, సెటిల్ మెంట్ లపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా మారాయి. దీంతో జాన్వీ అభిమానులు మాత్రం ప్రస్తుతం దేవర బ్యూటీని తొందరలోనే పెళ్లి కూతురిలా చూడలని ఉందని కామెంట్లు చేస్తున్నారు. తమ అభిమాన హీరోయిన్ కోరిక నెరవేరాలని కూడా ఎమోషనల్ గా కామెంట్లు చేస్తున్నారు.