Special FD Schemes: స్పెషల్ ఎఫ్‌డి అంటే ఏంటి, 4 లక్షలు పెడితే ఏ బ్యాంకులో ఎంత రిటర్న్ వస్తుంది

రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ కోసం చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తుంటారు. నిర్ణీత వ్యవధికై డిపాజిట్ చేస్తే వడ్డీ అధికంగా లభిస్తుంది. అయితే ఎఫ్‌డీ చేసే ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ లభిస్తుందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని బ్యాంకుల్లో ఒకే రకమైన వడ్డీ ఉండదు. ఎస్బీఐ, పీఎన్బీ, హెచ్‌డిఎఫ్‌సి, కెనరా, యాక్సెస్ బ్యాంకుల్లో ఏదెక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోందో తెలుసుకుందాం..

Special FD Schemes: రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ కోసం చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తుంటారు. నిర్ణీత వ్యవధికై డిపాజిట్ చేస్తే వడ్డీ అధికంగా లభిస్తుంది. అయితే ఎఫ్‌డీ చేసే ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ లభిస్తుందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని బ్యాంకుల్లో ఒకే రకమైన వడ్డీ ఉండదు. ఎస్బీఐ, పీఎన్బీ, హెచ్‌డిఎఫ్‌సి, కెనరా, యాక్సెస్ బ్యాంకుల్లో ఏదెక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోందో తెలుసుకుందాం..
 

1 /7

స్పెషల్ ఎఫ్‌డిలో నిర్ధారిత సమయం వరకూ డబ్బులు వెనక్కి తీయలేరు. కానీ వడ్డీ అధికంగా లభిస్తుంది. ఒకవేళ మీరు 4 లక్షలు డిపాజిట్ చేస్తుంటే ఏ బ్యాంకులో ఎంత రిటర్న్స్ లభిస్తాయో చెక్ చేద్దాం

2 /7

స్పెషల్ ఎఫ్‌డి స్కీమ్‌లో ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ అందిస్తోంది. ఇతరులకైతే 7.25 శాతం వడ్డీ ఉంటుంది. ఒకవేళ సీనియర్ సిటిజన్ ఎవరైనా 4 లక్షల అమృత్ వృష్టి పథకంలో పెడితే మెచ్యూరిటీ తరువాత 4,39,718 రూపాయలు లభిస్తాయి. ఇతరులకు 4,37,064 రూపాయలు వస్తాయి. దీని కాల పరిమితి 444 రోజులు.

3 /7

బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే స్పెషల్ ఎఫ్‌డీలో సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వడ్డీ అందిస్తోంది. ఇతరులకు 7.30 శాతం వడ్డీ అందుతుంది. దీని కాల వ్యవధి 400 రోజులు. సీనియర్ సిటిజన్లు ఇందులో 4 లక్షలు పెడితే మెచ్యూరిటీ అనంతరం 4,35,850 రూపాయలు లభిస్తాయి. 

4 /7

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీలో సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. ఇతరులకు మాత్రం 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. ఈ ఎఫ్‌డి కాల వ్యవధి 400 రోజులు. ఈ లెక్కన సీనియర్ సిటిజన్లు 4 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 4,35,612 రూపాయలు లభిస్తాయి.

5 /7

హెచ్‌డి‌ఎఫ్‌ సిలో సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీ అందుతుంది. ఇతరులకు 7.40 శాతం వడ్డీ ఉంటుంది. సీనియర్ సిటిజన్లు ఎవరైనా ఇందులో 4 లక్షలు పెడితే మెచ్యూరిటీ తరువాత 5,72,503 రూపాయలు లభిస్తాయి. ఇతరులు 5,59,773 రూపాయలు వస్తాయి

6 /7

కెనరా బ్యాంకు కూడా సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం, ఇతరులకు 7.40 శాతం వడ్డీ అందిస్తోంది. ఇందులో సీనియర్ సిటిజన్లు 4 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 5,05,807 రూపాయలు లభిస్తాయి.

7 /7

యాక్సిస్ బ్యాంకు అయితే స్పెషల్ ఎఫ్‌డీలో సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ, ఇతరులకు 7.25 శాతం వడ్డీ ఇస్తుంది. ఎవరైనా 4 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత 4,66,371 రూపాయలు అందుతాయి.