Honda Shine 125 New Model 2025: హోండా షైన్ 125 కొత్త మోడల్‌ వచ్చేసింది.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది భయ్యా!


Honda Shine 125 New Model 2025: ఈ సంవత్సరం కొత్త మోడల్ హోండా షైన్ 125 మోటర్‌సైకిల్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Honda Shine 125 New Model 2025: గతంలో హోండా షైన్‌ మోటర్‌సైకిల్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండేది. హీరో HF డీలాక్స్‌ మార్కెట్‌లోకి విడుదల కావడం వల్ల చాలా వరకు డిమాండ్‌ ఒక్కసారిగా తగ్గిపోయింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హోండా కంపెనీ ఇదే షైన్ 125 బైక్‌ను వివిధ వేరియంట్స్‌తో అప్డేట్‌ ఫీచర్స్‌తో విడుదల చేసింది. దీంతో ఈ మోటర్‌సైకిల్‌ డిమాండ్‌ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే హోండా కంపెనీ మార్కెట్‌లోకి మరికొన్ని అప్డేట్‌ ఫీచర్స్‌తో షైన్ 125 మోడల్‌ను విడుదల చేసింది. 

1 /5

హోండా షైన్ 125 కొత్త మోడల్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ. 85,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం ఇది రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.  ఇది మార్కెట్‌లో డ్రమ్‌తో పాటు డిస్క్ వేరియంట్స్‌లో విడుదలైంది.  

2 /5

ఈ హోండా షైన్ 125 ఎంతో శక్తివంతమైన 123.94cc మోటర్‌సైకిల్‌తో లాంచ్‌ అయ్యింది. ఈ ఇంజన్‌ అద్భుతమైన సింగిల్-సిలిండర్ PGM-Fi టెక్నాలజీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా 7.93 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు 11 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.  

3 /5

ఈ మోటర్‌సైకిల్ అద్భుతమైన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో విడుదలైంది. ఇది ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌ను కలిగి  ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా రియల్-టైమ్ మైలేజ్, రేంజ్, సర్వీస్ డ్యూ ఇండికేటర్‌ను కూడా అందిస్తోంది.  

4 /5

అలాగే ఇందులో కంపెనీ గేర్ పొజిషన్ ఇండికేటర్‌తో పాటు ఎకో ఇండికేటర్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు దూర ప్రయాణాలు చేసే క్రమంలో మొబైల్‌ను ఛార్జ్‌ చేసేందుకు USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఈ బైక్‌లో అనేక కొత్త ఫీచర్స్‌ను ఉండబోతున్నట్లు తెలుస్తోంది.   

5 /5

ఈ షైన్ 125 మోటర్‌సైకిల్ డిజైన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అంతేకాకుండా టైలిష్‌గా ఉంటుంది. అయితే గతంలో విడుదల చేసిన మోటర్‌సైకిల్‌ కొన్ని రంగులకే పరిమితం కాగా.. ఈ స్కూటర్‌ను ఇప్పుడు పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్‌తో పాటు జెన్నీ గ్రే మెటాలిక్, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ ఇలా చాలా కలర్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.