Aishwarya Rajesh: నరకం చూపించారు.. తను ప్రేమించిన అబ్బాయి గురించి ఐశ్వర్య కామెంట్స్..!

Aishwarya Rajesh relationship:  ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ రిలేషన్షిప్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఐశ్వర్యారాజేష్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈమె తన రిలేషన్షిప్ గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. మళ్లీ ప్రేమంటే భయం వేస్తోందని తెలిపింది. 

1 /5

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.  విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్,  మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.  భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  

2 /5

ఈ సినిమా అందించిన సక్సెస్ కారణంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది ప్రముఖ తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.  అందులో భాగంగానే తాను కూడా రిలేషన్ లో ఉన్నానని, అయితే ఆ రిలేషన్ కారణంగా తాను నరకం అనుభవించానని తెలిపింది. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. నేను రాంబంటు సినిమాతో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టాను. ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ తొలిసారి తమిళ్లో హీరోయిన్గా అవకాశం అందుకున్నాను. 

3 /5

మా అమ్మ నటి నాగమణి, నాన్న రాజేష్. మొత్తం మేము నలుగురు సంతానము.  అయితే చిన్న వయసులోనే నాన్న చనిపోవడంతో అమ్మ మా బాధ్యతను తీసుకొని, ఎంతో కష్టపడింది. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకొని చిన్న వయసులోనే నేను పార్ట్ టైం జాబ్ చేయడం మొదలుపెట్టాను. ఇక తర్వాత ఆమె ఇచ్చిన స్ఫూర్తితో నేను.. నాకు వచ్చిన సినిమాలలో నచ్చిన సినిమాను ఎంచుకొని నేడు ఈ స్థాయికి వచ్చాను. ప్రస్తుతం అమ్మని చూసుకోవడం గర్వంగా ఉంది అంటూ తెలిపింది ఐశ్వర్య రాజేష్.   

4 /5

అలాగే రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక వ్యక్తితో చాలా డీప్ గా రిలేషన్షిప్ మైంటైన్ చేశాను. అయితే కొద్ది రోజులు ప్రేమగా ఉన్న అతడు ఆ తర్వాత నరకం చూపించడం మొదలుపెట్టాడు.  అతడి కారణంగా నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.  అంతకుముందు కూడా అలాంటి ప్రేమను నేను చూసాను.   

5 /5

వాస్తవానికి నేను చాలా సెన్సిటివ్. ప్రేమ లో పడడం ఎంత తీయగా ఉంటుందో.. ఆ ప్రేమ బ్రేకప్ అయినప్పుడు మిగిల్చే విషాదం అంతకు రెట్టింపు బాధను కలిగిస్తుంది.  ఇక ఆ బాధను అనుభవించాను కాబట్టే మళ్లీ ప్రేమ అంటేనే భయం వేస్తోంది అంటూ రిలేషన్షిప్ గురించి చెప్పుకొచ్చింది ఐశ్వర్య.