Heat Effect Alert: ఎండకాలం దగ్గరికి రానుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సీజన్ ప్రారంభం అవుతుంది. అయినా ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి సగం నెల గడిచిపోయింది. ఇప్పటికే ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. ముఖ్యంగా మార్చి 15 నుంచి దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతాయని హెచ్చరిక చేసింది.
ఫిబ్రవరి ప్రారంభంలోనే ఈ ఏడాది ఎండలు మండిపోవడం మొదలయ్యాయి. చలికాలం కూడా రికార్డు స్థాయిలో నమోదయింది. ఇంకా వర్షాలు, వరదలు కూడా బీభత్సం సృష్టించాయి. అయితే ఎండలు కూడా ఈసారి ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లే ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో ఉక్కపోత మొదలైంది.
ఫిబ్రవరి సగం నేల పూర్తయింది ఇప్పటికే ఉక్కపోత మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలో ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయితాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.. ముఖ్యంగా మార్చి 15వ తర్వాత ఎండలు తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరిక చేశారు
ప్రస్తుతం పగలంతా వేడి అధికంగా ఉంది.. రాత్రి సమయంలో కాస్త ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోత అలాగే ఉంది. అయితే మార్చి 15వ తర్వాత ఈ ఎండల తీవ్రత మరింత పెరగనుంది.. రాత్రి వాతావరణం కూడా వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా నార్త్ ఇండియాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు ప్రధాన కారణం అని చెప్తున్నారు.
భూమి మండుతుందని ఈ నేపథ్యంలో ఈ వాతావరణంలో ఈ సమూలమైన మార్పులు వస్తున్నాయని ప్రజలు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ సమయంలో బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు.