Heat Alert In AP: వాతావరణంలో వేడి పెరిగింది.. ఎండాకాలం ముందే వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత మొదలైంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే, నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఎండాకాలం సీజన్ ప్రారంభం కాకముందే ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి సమయంలో వేడి విపరీతంగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో ఉక్కపోత కూడా ఎక్కువైంది. అయితే, ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినందుకు ఈ సారి ఎండాకాలం ముందే వచ్చింది.
వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీలు కూడా నమోదు అవుతాయని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదు అవుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువ ఉండనుందని అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరి నెల ప్రారంభం ముందే ఎండ మొదలైంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉక్కపోత విపరీతంగా పెరిగింది. శివరాత్రి తర్వాత ప్రారంభం అయ్యే ఎండ ఈసారి ముందే వచ్చేసింది.
ఈనేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఎండ సమయంలో వీరు బయటకు రాకపోవడమే మేలని సూచిస్తున్నారు..