PF Savings: ఈపీఎఫ్ ద్వారా ఉద్యోగులు ప్రతినెలా కొద్ది మొత్తంలో జమ చేసుకుని పదవి విరమణ తర్వాత భారీ మొత్తంలో నిధులను పొందవచ్చు. ఇప్పటికే ఈపీఎఫ్ఓ 28కోట్ల మంది ఉద్యోగుల ఈపీఎఫ్ అకౌంట్లను మేనేజ్ చేస్తోంది.
PF Savings: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వంలోని ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా సేవింగ్స్ స్కీమ్స్ ను అమలు చేస్తోంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందించే లక్ష్యంతో ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ రూపంలో ఉద్యోగుల పొదుపు ఖాతాలను ఈపీఎఫ్ఓ మెయింటెన్ చేస్తోంది.
ఈపీఎఫ్ ద్వారా ఉద్యోగులు ప్రతి నెలా కొద్ది మొత్తంలో జమ చేసుకుని రిటైర్ అయ్యాక భారీ మొత్తంలో నిధులను పొందవచ్చు. ఇప్పటికే ఈపీఎఫ్ఓ 28కోట్ల మంది ఉద్యోగుల ఈపీఎఫ్ అకౌంట్లను మేనేజ్ చేస్తోంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా నిలుస్తోంది. మీరు నెలకు రూ. 15వేలు, రూ. 30వేలు, రూ. 40వేలు సంపాదిస్తే రిటైర్మెంట్ అయ్యాక ఎంత పొందవచ్చో తెలుసుకుందాం.
ఈపీఎఫ్ఓ స్కీములో భాగంగా ఉద్యోగి వేతనంలోని కొంత భాగం పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. మరికొంత షేర్ ని ఉద్యోగి కంపెనీ అకౌంట్లో క్రెడిట్ చేస్తోంది. ఈ సేవింగ్ స్కీములో నుంచి ఉద్యోగులు ఏ క్షణమైనా తమ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే రిటైర్మెంట్ అయ్యే వరు ఇందులోని డబ్బును ముట్టుకోకపోతే ఆ తర్వాత భారీ మొత్తంలో చేతికి అందే అవకాశం ఉంటుంది.
ఈపీఎఫ్ అకౌంట్లో జమ అయ్యే మొత్తంపై ఈఫీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు రూ 8.25శాతంగా ఉంది. పీఎఫ్ అకౌంట్ తో పాటు పెన్షన్ ఫండ్ కూడా ఉంది. అయితే ఈ పెన్షన్ ఫండ్ లో మొత్తానికి ఈపీఎఫ్ఓ ఎలాంటి వడ్డీ చెల్లించదు. కేవలం మీ అకౌంట్లోని డబ్బుకు మాత్రమే వడ్డీ వరిస్తుంది.
ఈపీఎఫ్ అకౌంట్లో ప్రతినెలా ఎంత మొత్తం జమ కావాలనేదానికి ఓ లెక్క ఉంటుంది. ఉద్యోగి బేసిక్ సాలరీ, డియర్ నెస్ అలవెన్స్ కలపగా వచ్చే దాంట్లో 12శాతాన్ని అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. కంపెనీ కూడా ఇంతే మొత్తంలో కంట్రీబ్యూట్ చేస్తుంది. అయితే కంపెనీ అందించే ఈ 12శాతంలో 8.33శాతం మొత్తం పెన్షన్ ఫండ్ లోకి వెళ్తుంది. మిగతా 3.67శాతం మాత్రమే ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. 3.67శాతానికి మాత్రమే వడ్డీ వర్తిస్తుంది.
మీకు నెల జీతం రూ. 30వేలు ఉంటే రిటైర్మెంట్ అయ్యే సరికి కాంట్రిబ్యూషన్ రూ. 54,06,168అవుతుంది. మీ చేతికి రూ. 2.17కోట్లు వస్తుంది. ప్రతినెలా రూ. 40వేలు సంపాదిస్తే మొత్తం కంట్రిబ్యూషన్ రూ.72,08,492 అవుతుంది. మొత్తం రూ. 2.9కోట్లు తీసుకోవచ్చు.