PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం బిగ్‌ షాక్‌.. ఈసారి వారికి మాత్రమే రూ. 2000 జమా, ఎందుకంటే?

PM kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన (Pm Kisan Yojana) ఈ నెల 24వ తేదీ బీహార్‌ పర్యాటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 19వ విడుత నిధులు విడుదల చేస్తారని ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ లబ్ది కొంతమంది రైతులు పొందలేరు. ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /6

కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా చిన్నా సన్నకారు రైతులు తమ వ్యవసాయ పెట్టుబడులకు సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు కేంద్రం 18 విడుతలు నిధులు మంజూరు చేసింది.  

2 /6

ఈ పథకం కేంద్రం 2018లో ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది రూ.6000 ప్రతి రైతు ఖాతాల్లో జమా చేస్తోంది. ఈ నిధులను మూడు విడుతల్లో రూ.2000 చొప్పున విడుదల చేస్తుంది. ఇవి నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) అవుతాయి.  

3 /6

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా మనదేశంలో కొన్ని కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. అయితే, 19వ విడుత పీఎం కిసాన్‌ నిధులు ఈనెల 24న కేంద్రం రూ.2000 రైతులు ఖాతాల్లో జమా చేయనుంది. బిహార్‌ భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరు కానున్నారు.  

4 /6

దీంతో అక్కడి నుంచే నిధులు విడుదల చేయనున్నారని కేంద్రం ఇటీవలె ప్రకటించింది. అయితే, ఈ 19వ విడుత నిధులు కేవలం ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే అందుతాయి. ఈ 19వ విడుత ద్వారా 9.6 కోట్ల మందికిపైగా రైతులు లబ్ది పొందనున్నారు.  

5 /6

ఇకేవైసీ పూర్తి చేయడం సులభం. ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. pmkisan.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో కేవైసీ అందుబాటులో ఉంది. ఇంట్లోనే సులభంగా కేవైసీ పూర్తి చేయండి. లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (CSC)లలో కూడా ఇకేవైసీ పూర్తి చేస్తారు.  

6 /6

2024 అక్టోబర్ 5వ తేదీ పీఎం కిసాన్‌ 18వ విడుత నిధులు విడుదల చేసింది. ఈనెల 19వ విడుతకు రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే, బెనిఫిషియరీ స్టేటస్‌ కూడా ఈ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకునే సౌలభ్యం కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం.