Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు.. ఉద్యోగులు ఆశిస్తున్న టాప్‌ 5 ప్రయోజనాలు ఇవే!

Tax Payers Top 5 Expectations On Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోతుండడంతో దేశవ్యాప్తంగా బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు బడ్జెట్‌పై ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో తమకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌పై ఉద్యోగులు ఆశించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.

1 /6

కేంద్రం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌పై ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌కు తమకు ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయోననే ఉత్కంఠ నెలకొంది. జీతం చేసే వారు.. పన్ను చెల్లించే వారు ఆశిస్తున్న అతి ముఖ్యమైన ఐదు ప్రయోజనాలు ఇవే

2 /6

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ పన్ను రాయితీపై ఎన్నో ఆశలతో ఉన్నారు. గత బడ్జెట్‌లలో పన్ను రాయితీపై పెద్దగా ప్రయోజనం లభించకపోవడంతో వారి ఆశలు పెరిగిపోయాయి. ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలు తమకు భారీగా రాయితీ లభిస్తుందని ఆశిస్తున్నారు.

3 /6

వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు తగ్గుతాయని పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్నారు. 57 శాతం మంది తక్కువ వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు ఆశిస్తుండగా..25 శాతం మంది అధిక మినహాయింపు వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.

4 /6

కొత్త ఆదాయపు పన్ను విధానంలో మరింత ఆకర్షణీయంగా చేయడానికి పన్ను రేట్లను తగ్గించాలని అందరూ ఆశిస్తున్నాయి. మినహాయింపు

5 /6

పర్యావరణ అవగాహన పెంపొందించడానికి.. పర్యావరణానికి అనుకూలంగా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి ఎన్‌పీఎస్‌ నిబంధనలు ఉంటాయని ఆశిస్తున్నారు. విద్యుత్‌ వాహనాలకు పన్ను రాయితీలు పెంపు కోసం కొన్ని వర్గాలు ఆశిస్తున్నాయి.

6 /6

జీతం పొందే ఉద్యోగులు స్టాండ్‌ అప్‌డేట్‌ చేసిన రిటర్న్‌లపై అదనపు పన్ను/ జరిమానా తగ్గించాలని కూడా ఆశిస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించడానికి గడువు పొడిగించాలని కొన్ని వర్గాల నుంచి విజ్ఞప్తలు వస్తున్నాయి.