Parental pension for Daughter: ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని బెనిఫిట్స్ అందుతాయి. సాధారణంగా కుమారులకు వారసత్వంగా ఆ ప్రయోజనాలన్నీ లభిస్తాయి. మరి ఆడపిల్లల పరిస్ధితి ఏంటి? ముఖ్యంగా కుమార్తెలు తల్లిదండ్రుల పెన్షన్ పొందడానికి అర్హత ఉందో లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Family pension: చాలామంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఉద్యోగంలో ఉన్నా, రిటైర్ అయిన ఎన్నో ప్రభుత్వ ప్రయోజనాలు పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగి బ్రతికి ఉండగా ప్రభుత్వ క్వార్టర్స్, టీఏ, డీఏ, బోనస్ ఇలా ఎన్నో రకాల అలవెన్స్లు వాళ్ళకి అందుతాయి. ప్రమాదవశాత్తు ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే.. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి అనేక బెనిఫిట్స్ అందుతాయి. పిఎఫ్, పెన్షన్ ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో సేవలు వారికి అందుతూ ఉంటాయి.
2021 కేంద్ర పౌర సేవల నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి మరణించినట్లయితే.. వారి కుటుంబానికి కొంత పెన్షన్ ఇస్తారు. దీని హౌస్ పెన్షన్ అంటారు. ఈ కుటుంబ పెన్షన్ కోసం ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబ సభ్యుల పేర్లు నామినేట్ చేస్తారు. అందువల్ల వారి మరణం తర్వాత వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది. కేంద్ర పౌర సేవల నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి చేసే తల్లిదండ్రులు పెన్షన్ పొందడానికి ఆడపిల్లలకు కూడా అర్హత ఉంటుంది. అయితే ఈ పెన్షన్ పొందాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి.
పెళ్ళికాని కుమార్తెలు హౌస్ పెన్షన్ పొందవచ్చు. 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు కూడా ఎలాంటి సంపాదన లేకుండా జీవిస్తున్న పెళ్లి కానీ ఆడపిల్లలు తమ పేరెంట్స్ పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. వేరే కాకుండా విడాకులు తమ తల్లిదండ్రుల పెన్షన్ తీసుకోవచ్చు. విడాకులు తీసుకున్న కుమార్తె డైవర్స్ మంజూరైన తర్వాతే హౌస్ పెన్షన్ అర్హులరవుతారు. వయసుతో సంబంధం లేకుండా పేరెంట్స్ పెన్షన్ పొందే అర్హత వారికుంటుంది.
ఒకవేల ఉద్యోగం చేస్తున్న తన కుమార్తే పేరును ప్రభుత్వ ఉద్యోగి నామినీగా చేర్చినట్లైతే ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుమార్తె సంపదన సపోర్ట్ తదితర విషయాలు పరిగణించినప్పుడు ఆమె ఎంత పెన్షన్ లభిస్తుందో ప్రభుత్వ అధికారులు నిర్ణయిస్తారు.
ఆడపిల్లలు ఇద్దరు, ముగ్గురు ఉంటే వారిలో పెద్ద కుమార్తె పెళ్లి గాని కుమార్తెకి హౌస్ పెన్షన్ పొందేందుకు అర్హత ఉంటుంది. ఈ కేస్ స్టడీలో తల్లిదండ్రులు ఇద్దరు మరణించి ఉంటేనే పెద్ద అవివాహిక కుమార్తెకు పెన్షన్ లభిస్తుంది.
ఒకవేళ కవలలు అయితే హౌస్ పెన్షన్ మొత్తాన్ని వారిద్దరికీ సమానంగా పంచుతారు. తల్లితండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇద్దరు పెన్షన్లు వారు పొందవచ్చు. కుమార్తె దత్తత తీసుకున్న అమ్మాయి అయితే హౌస్ పెన్షన్ అవ్వడానికి తక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఒరిజినల్ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి ఇతర నియమాలను పరిధిలోకి తీసుకుంటారు. ఇలా మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల కుమార్తెలు కూడా పెన్షన్ పొందేందుకు అర్హులేనని చెప్పవచ్చు.