Maha kumbh: కుంభమేళ నీళ్లలో మలంలో ఉండే బ్యాక్టిరియాలు.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డు..

Faecal bacteria in kumbh mela water: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళకు భారీగా భక్తులు వస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్జీటీ, సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బొర్డ్ షాకింగ్ విషయాలను బైటపెట్టాయి.
 

1 /6

మహా కుంభమేళలకు దేశం నలు మూలల నుంచి  భక్తులు వస్తునే ఉన్నారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈక్రమంలో కుంభమేళకు ఇప్పటి వరకు దాదాపుగా.. 53 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.  

2 /6

అదే విధంగా 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభమేళ కావడంతో ఎలాగైన పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. మొత్తంగా కుంభమేళకు వస్తున్న వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.

3 /6

మరొవైపు కుంభమేళలో కొంత మంది తమ పెంపుడు జంతువుల్ని స్నానాలు చేయిస్తున్నారు. మరికొందరు నీటి ఒడ్డుదగ్గరే మల, మూత్రాలను విసర్జిస్తున్నారు. కొన్ని చోట్ల మలం నీళ్లు కూడా లీక్ అయి గంగ నీళ్లలోకి వచ్చేస్తున్నాయి.  

4 /6

చిరిగిన బట్టలు, చెప్పులు, ఇతర వ్యర్థ పదార్థాలను నీళ్లలో పడేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కుంభమేళలో నీళ్లను సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బొర్డ్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లు సాంపుళ్లను సేకరించాయి. తాజాగా.. ఈ నీళ్ల నుంచి రిపోర్టులు వచ్చాయి. దీనిలో భారీగా  కోలిఫామ్ బ్యాక్టిరియా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

5 /6

కేవలం. 100 మిలీటర్ల నీళ్లలో.. 3,500 కోలీఫామ్ బ్యాక్టిరియా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. యూపీ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ కాలుష్యంను నివారించడంలో పూర్తిగా విఫలమైందని సెంట్రల్ పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ సీరియస్ అయ్యింది.

6 /6

మానవ, జంతు మల విసర్జాతాలు నీళ్లలో చేరాయన్నారు. దీని వల్ల కలరా, విరేచనాలు, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ వంటి ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. దీని వల్ల మానవ శరీరంలోని జీర్ణవ్యవస్థ ప్రభావితమౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.