BSNL: ఎవడ్రా BSNL పడిపోయిందని చెప్పేది..ఈ లెక్కలు చూసి ఆ మాట చెప్పండి..17ఏళ్ల తర్వాత కోట్లలో లాభాలు

BSNL: ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు వచ్చాయి. కంపెనీ లాభాలు బాట పట్టింది. 17ఏళ్ల తర్వాత మొదటిసారిగా రూ. 262కోట్లకుపైగా పెరిగింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించలేదు. మొబిలిటీ, ఎఫ్‌టిటిహెచ్ ,లీజుకు ఇచ్చిన లైన్ సర్వీస్ ఆఫర్‌లలో 14-18 శాతం వృద్ధిని సాధించింది.
 

1 /6

BSNL: బీఎస్ఎన్ఎల్ కష్టాలు తొలగిపోయాయి. ఇప్పుడన్నీ మంచిరోజులే. అవును కంపెనీ 17ఏండ్ల తర్వాత మొదటిసారిగా లాభాల బాట పట్టింది. రూ. 262కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించలేదు లాభాలు ఈ విధంగా పెరగడానికి కారణం వేగవంతమైన నెట్ వర్క్ విస్తరణ, తక్కువ ధరలకు సేవలను అందించడమని నిపుణులు చెబుతున్నారు.   

2 /6

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేశారు. దేశంలో టెలికం రంగం ప్రయాణంలో ఈ రోజు చాలా ముఖ్యమైందన్నారు. ప్రధానమంత్రి మోద నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు టెలికాం రంగం కీలక స్తంభంగా పనిచేస్తుందన్నారు. డిజిటల్ యుగంలో భారతదేశ టెలికాం రంగం కొత్త శిఖరాలకు చేరకోవడానికి ప్రధాని దార్శనికత కారణమన్నారు. 

3 /6

సేవా సమర్పణలు,  కస్టమర్ బేస్‌ను విస్తరించడంపై దృష్టి సారించిన ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీకి ఇది ఒక మలుపు అని సింధియా అభివర్ణించారు. బిఎస్‌ఎన్‌ఎల్ అనేక రంగాలలో మెరుగుదల నమోదు చేసింది. మొబిలిటీ, ఎఫ్‌టిటిహెచ్ ,లీజుకు ఇచ్చిన లైన్ సర్వీస్ ఆఫర్‌లలో 14-18 శాతం వృద్ధిని సాధించింది.  

4 /6

బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ల సంఖ్య కూడా డిసెంబర్‌లో దాదాపు 9 కోట్లకు పెరిగింది. ఇది జూన్‌లో 8.4 కోట్లుగా ఉంది. ఈ రోజు BSNL కి  భారతదేశంలో టెలికాం రంగం ప్రయాణానికి ఒక ముఖ్యమైన రోజు. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 17 సంవత్సరాలలో మొదటిసారిగా BSNL త్రైమాసిక ప్రాతిపదికన లాభాలను నివేదించింది. బిఎస్‌ఎన్‌ఎల్ చివరిసారిగా త్రైమాసిక లాభాన్ని నమోదు చేసింది 2007 సంవత్సరంలో. ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో నికర లాభం దాదాపు రూ.262 కోట్లుగా ఉంది.  

5 /6

గత ఏడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే మొబిలిటీ సేవల ఆదాయం 15 శాతం, ఫైబర్-టు-ది-హోమ్ ఆదాయం 18 శాతం, లీజుకు ఇచ్చిన లైన్ సేవల ఆదాయం 14 శాతం పెరిగాయి. సింధియా  తెలిపిన వివరాల ప్రకారం.. BSNL తన ఆర్థిక ఖర్చులను, మొత్తం వ్యయాన్ని తగ్గించుకుంది. తద్వారా గత సంవత్సరంతో పోలిస్తే నష్టాలను రూ.1,800 కోట్లకు పైగా తగ్గించింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో, BSNL నేషనల్ వైఫై రోమింగ్, BITV - అన్ని మొబైల్ కస్టమర్లకు ఉచిత వినోదం అన్ని FTTH కస్టమర్లకు IFTV  మైనింగ్ కోసం మొదటి ప్రైవేట్ 5G కనెక్టివిటీ వంటి ఆఫర్లను ప్రవేశపెట్టింది.  

6 /6

దేశవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులందరికీ 4G సేవలను అందించే దిశగా బిఎస్‌ఎన్‌ఎల్ అడుగులు వేస్తున్నందున, ఈ త్రైమాసికంలో లాభదాయకతకు తిరిగి రావడం ఒక మలుపు అని కేంద్ర మంత్రి అన్నారు. 100,000 టవర్లలో, దాదాపు 75,000 టవర్లు ఏర్పాటు అయ్యాయి. దాదాపు 60,000 పనిచేస్తున్నాయి. ఈ సంవత్సరం జూన్ నాటికి అన్ని 100,000 టవర్లు పనిచేస్తాయని మేము ఆశిస్తున్నాము అని కేంద్రమంత్రి తెలిపారు.