BSNL Long Term Plans in Telugu: దేశంలో గత కొద్దిరోజులుగా బీఎస్ఎన్ఎల్ మరోసారి దూసుకొస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ రేట్లు పెంచడం ఓ కారణమైతే, తక్కువ ధరకే లాంగ్ టెర్మ్ ప్లాన్స్ అందించడం మరో కారణం. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఏకంగా 395 రోజుల ప్లాన్ కూడా అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ బెస్ట్ లాంగ్ టెర్మ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
BSNL 1198 Plan ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులకు వర్తిస్తుంది. ఇందులో నెలకు 3 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం ఏడాదిలో 36 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉండదు. 300 నిమిషాల వాయిస్ కాలింగ్ టైమ్ ఉంటుంది. అంటే అటు డేటా లేదా ఇటు ఫోన్స్ పెద్దగా అవసరం లేనివారికి ఇది బెస్ట్ ప్లాన్. ఎందుకంటే కేవలం 1198 రూపాయలకే ఏడాది వ్యాలిడిటీ లభిస్తుంది.
BSNL 1499 Plan ఈ ప్లాన్ 336 రోజులకు ఉంటుంది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. కానీ డేటా 336 రోజులకు కలిపి 24 జీబీ మాత్రమే ఉంటుంది. అంటే డేటా పెద్దగా అవసరం లేనివారికి ఇది బెస్ట్ ప్లాన్. ఇతర టెలీకం కంపెనీల్లో డేటా అవసరం లేని ప్లాన్స్ దాదాపుగా లేవు
BSNL 1899 Plan బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో కూడా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటా లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. జింగ్ మ్యూజిక్, హెలో ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్ వంటివి ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
BSNL 2399 Plan సాధారణంగా వివిధ కంపెనీల రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ అత్యధికంగా ఏడాది వ్యాలిడిటీతో ఉంటాయి. కానీ బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 2399 రూపాయల ప్లాన్ ఏకంగా 395 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. దాదాపు 13 నెలల వ్యాలిడిటీ. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. దాంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇక జింగ్ మ్యూజిక్, హెలో ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్ వంటివి ఉచితంగా లభిస్తాయి.
BSNL Long Term Plans in Telugu: ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇప్పుడు చౌక ధరలో రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ టెర్మ్ ప్లాన్స్ అయితే అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలతో పోలిస్తే చాలా చౌక ధరకే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.