Brahmamudi Today December 28 Episode: కావ్య రూల్స్ వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుగున్నారు అన్నయ్య అని ప్రకాశం సుభాష్‌తో చెబుతాడు. ఏరా.. నువ్వు నా కోడలిపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అంటాడు సుభాష్. ఛీఛీ కొన్ని విషయాలు చూసి చూడకుండా వదిలేస్తే మంచిది కదా.. అని అంటున్నా అంటాడు ప్రకాశం. అప్పుడే సుభాష్‌కు ఆసుపత్రి బిల్ చెక్ క్లియర్ కాలేదని కాల్ వస్తుంది.
కావ్య.. కావ్య.. అని పిలుస్తాడు సుభాష్. ఏమైంది మావయ్యగారు అంటుంది కావ్య, ఆసుపత్రి బిల్ ఇంకా క్లీయర్ అవ్వలేదంటా ఎందుకమ్మా? అంటాడు సుభాష్. లోకకల్యాణం కోసం అంటూ రుద్రాణీ నీతులు చెబుతుంది. ఎవరిని ఉద్దరించడానికి అంత చిన్న అమౌంట్ ఆపారు. అయినా ఆసుపత్రి బిల్లు ఆపే అధికారం ఈమెకు ఎక్కడిది అంటుంది ధాన్యం. టిఫీన్, కాఫీలు రూల్స్ గురించి కడిగేస్తుంది. ఇన్నిటికీ నువ్వు ఆంక్షలు పెట్టావు. కానీ, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఆపేస్తారు అని తెలిసినా బిల్ ఎందుకు కట్టలేదు? సమాధానం చెప్పవేంటి అంటుంది ధాన్యం. మా క్రెడిట్ కార్డులు కూడా బ్లాక్ చేయించింది. ఇందులో ఏ పరమార్ధం ఉంది అంటుంది రుద్రాణీ. అప్పుడే రాజ్ నేను చెబుతా.. అంటు వస్తాడు.
మేం దేనిగురించి అడుగుతున్నామో ఆ విషయం నీకు తెలుసా? అంటుంది రుద్రాణీ. వీధిలో కూరగాయలు అమ్మేవారికంటే పెద్దగా వస్తుంది అంటాడు. ఏంటత్తయ్య మీ బాధ ఇంత వరకు తాతయ్య రూ.5 లక్షలు కట్టలేదట. ఈ అనామకురాలి చేతిలో ఆస్తి పెట్టాడు ఆపెద్ద మనిషి ఆసుపత్రి బిల్ కట్టలేదట. విదేశాలకు దాటేస్తుందా? లేదా పుట్టింటికి చేరవేస్తుందా? అంటుంది. ఇందులో నా భార్య ప్రమేయం ఉందని ఎందుకు అనుకుంటున్నారు?
ఇందులో కావ్య ప్రమేయం లేకపోతే నీ ప్రమేయం ఉందా? అంటుంది అపర్ణ. లక్ష అవరసరాలు ఉన్నా.. తాతయ్య ట్రీట్మెంట్ బిల్ కట్టాలి కదా ఎందుకు ఆగింది అని ఇందిరా దేవి అడుగుతుంది. లేదంటే అంత ఖరీదైన వైద్యం ఎందుకు చేయించాలి అనుకుంటున్నారా? అంటుంది ధాన్యం. చిన్నత్తయ్య అసలు జరిగిందేంటో తెలిస్తే.. అనబోతే రాజ్ ఆపేస్తాడు. నేనే చెబుతా అంటాడు రాజ్.
రాజ్ ఏంట్రా.. ఏం జరుగుతుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు అంటాడు సుభాష్, ఏదో దాస్తున్నారు నిజం ఏంటో చెప్పు అంటుంది అపర్ణ. ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతుంది అందుకే ట్రాన్సక్షన్స్ ఆగిపోయాయి అంటాడు. ఇప్పుడు ఏంట్రా మార్చిలో కదా జరిగేది అంటాడు ప్రకాశం. శభాష్ చిన్నన్నయ్య అన్ని మర్చిపోయినా ఆడిటింగ్ మర్చిపోలేదు అంటుంది రుద్రాణీ. అవును రాజ్ ఆడిటింగ్ మార్చిలో కదా ఉంటుంది. ఇప్పుడు జరగడం ఏంటి? అంటుంది రుద్రాణీ.
దానికి నీ కొడుకే కారణ అత్త అంటాడు. ఇది బానే ఉంది అటు తిరిగి ఇటు తిరిగి నామీద వేస్తవు అంటాడు రాహుల్. సీఈఓ సీట్‌లో కూర్చున్నాడు కదా లెక్కలు లేవు, లెడ్జర్లు లేవు ఇదంత రాహుల్ వల్ల జరిగిందని అర్థమైనా ఇంట్లో చెప్పలేదు. మీరు నన్ను, నా భార్యను నిలదీసే సరికి చెప్పాల్సి వచ్చింది. మీరేమో చెప్పేదాకా వదిలేలా లేరు. నా లెక్క తప్పింది, తాతయ్య ట్రీట్మెంట్‌కు ఇచ్చిన చెక్ క్లీయర్ అయిందనుకున్నా. ఇందులో నా తప్పు ఉంది.
ఇది బానే ఉంది. సడన్‌గా నీ భార్య మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చుంది అంటుంది రుద్రాణీ. ఏదైనా న్యాయం మాట్లాడా ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అనేముందు ఆలోచించండి పదా కళావతి అని రాజ్ వెళ్లిపోతాడు. అప్పుడే ఇందిరా దేవి కూడా పెరట్లోకి వెళ్లి కూర్చుంటుంది. కావ్య వచ్చి మాట్లాడొచ్చా అమ్మమ్మ అంటుంది. సొంతవాళ్లను కూడా అనుమతులు తీసుకోవడం ఎప్పట నుంచి నేర్చుకున్నావ్ అంటుంది ఇందిరాదేవి.
ఆసుపత్రి బిల్ గురించి భయపడకండి. నేను మీ మనవడు ఇప్పుడే బిల్ కట్టేస్తాం. అర్థం చేసుకోండి అంటుంది కావ్య. నా మౌనానికి కారణం నీ మీద కోపమో ఇంకేదో కాదు.. ఇన్ని కోట్ల వ్యాపారం చేసే మనం కేవలం రూ.5లక్షలు కట్టకపోవడం ఏంటి? ఆ సందర్భానికి మీరు చెప్పినట్లు ఉంది అంటుంది ఇందిరాదేవి. ఈ ఇల్లు ముక్కలు అవ్వకుండా ఎన్ని ఒడిదుడుకులు పడుతున్నారేమో, మాకు చెప్పుకోవట్లేదేమో అనిపిస్తుంది. మీ తాతయ్య తన మనవడిని కూడా కాదని నీపేరున రాశాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకు అంటుంది అమ్మమ్మ. ఆయన మాటకు కూడా ఎక్కడా మచ్చ రానివ్వను ఆ విషయంలో ధైర్యంగా ఉండండి అని సర్ధిచెబుతుంది కావ్య.
బెడ్‌రూమ్‌లో రాజ్ జస్ట్ మిస్ తాతయ్య వంద కోట్లు ష్యూరిటీ అందిరికీ తెలిసిపోయేది. ఇళ్లంతా అల్లకల్లోలం అయ్యేది అని ఊపిరి పీల్చుకుంటాడు. లేదు అర్జెంటుగా ఏదో ఒకటి చేసి ఆ ఐదు లక్షలు కట్టేయాలి అనుకుంటాడు. అప్పుడే సుభాష్ వచ్చి ఏమైంది రాజ్? ఎందుకు ఇలా ఉన్నావు నేను మీ నాన్నను నీ ఎమోషన్‌ను నేను అర్థం చేసుకోగలను అంటాడు. ఇప్పుడు చెప్పు కింద అందరి ముందు నువ్వు చెప్పింది అబద్ధం కదా అంటాడు. నువ్వు ఏదో దాస్తున్నావ్ నిజం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్. లేదు డాడ్ నిజంగానే ఆఫీస్‌లో ఆడిటింగ్ చేయిస్తున్నా అంటాడు రాజ్.
పదేపదే రాజ్‌ను సుభాష్ ఎంత అడిగినా రాజ్ చెప్పడు. రేయ్.. నిన్ను నమ్మి కంపెనీ బాధ్యతలు అప్పగించాంి వెళ్లిపోతాడు. మరోవైపు ధాన్యంను ఆ రాజ్ అర్థం పర్థం లేని అనార్థాల గురించి ఏమనుకుంటున్నావ్ అంటుంది రుద్రాణీ. మాటమార్చి కావాలని ఆడిటింగ్ అని చెబుతున్నారు అంటుంది. అయితే, కార్లు కూడా వెనక్కి పంపించేస్తారు. ఇదంతా చూసిన రుద్రాణీ. ఈ కార్ల వ్యవహారం అందరికీ చెప్పి కావ్య అదికారం చెలాయిండానికి కాదు అడుక్కుతినడానికి కూడా పనికిరాదు అని తేలుద్దాం అని రాహుల్‌తో అంటుంది.