BJP Manifesto 2024: 2024 లోక్ సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఎన్నో వ్యూహ ప్రతి వ్యూహాలతో తన సంకల్ప పత్ర పేరుతో తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫేస్టోను తయారు చేసారు. ఈ మేనిఫేస్టోలో 14 అంశాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టో రూపకల్పనలో ఎంతో కృషి చేసినట్టు ప్రధాని మోదీ మేనిఫేస్టో విడుదల కార్యక్రమంలో పేర్కొన్నారు. అవేంటో చూద్దాం..
బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు.. -70 యేళ్లు పై బడిని సీనియర్ సిటీజన్స్ (వృద్దులకు) ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ. లక్షల వరకు ఉచిత వైద్య బీమా..
-మూడు కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం.. -ట్రాన్స్‌జెండర్స్‌కు సైతం ఆయుష్మాన్ భారత్..
మరో ఐదేళ్ల పాటు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత రేషన్.. పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా..
-ముద్ర ఋణాల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంపు.. -దివ్యాంగులకు ప్రత్యేక ఇళ్ల నిర్మాణం..
-మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారుణిలుగా మార్చే బృహత్తర ప్రణాళిక.. -డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు..
-కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త కస్టర్లు.. -మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాం..
-చేపల ఉత్పత్తికి ప్రత్యేక ప్రాసెసింగ్‌కు సెపరేట్ క్లస్టర్లు.. -ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం..